రాజాం ( జనస్వరం ) : నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు యు.పి.రాజు ఆధ్వర్యంలో సంతకవిటి మండలంలో చేనేత కార్మికులతో మంగళవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం కార్యదర్శి కాటం అశ్విని పాల్గొని చేనేత కార్మికులును ఉద్దేశించి మాట్లాడుతూ ఆహారాన్ని అందించే రైతన్న ప్రపంచానికి ఎంత అవసరమో, వస్త్రాన్ని అందించే నేతన్న కూడా అంతే అవసరం ఉన్నప్పటికీ కూడా అర్హులైన వారికి కూడా వైసీపీ ప్రభుత్వం చేనేతలకు అన్యాయం చేస్తుంది అని అన్నారు. నేతన్నలు సమస్యలు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొని వెళ్తాను అని వాళ్లలో భరోసా నింపారు.అనంతరం నియోజకవర్గం నాయకులు యు.పి.రాజు మాట్లాడుతూ అంతరించిపోతున్న చేనేత కళను నేతన్నలను కాపాడే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది అని చేనేత కార్మికుల సంక్షేమానికి పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు అని జనసేన ప్రభుత్వంతోనే చేనేత కార్మికుల కష్టాలు తీరుతాయానీ చేనేత కార్మికులకు పవన్ కళ్యాణ్ గారు అన్నిరకాలగా అండగా ఉంటారు అని పొత్తుల్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటూ జనసేన టీడీపీ కు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు గొర్లె గోవిందరావు,ఎన్ని సత్యనారాయణ,దాలిరామ్, నవీన్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.