Logo
Date of Publish : 23 November 2025, 10:09 pm
Editor : Sake Naresh

లోకేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జనసేనపార్టీ

తాడేపల్లి, అక్టోబర్ 23, (జనస్వరం) : చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలోని రాయలచెరువు పంచాయతీకి చెందిన జనసేన కార్యకర్త పెనుగొండ లోకేష్ ప్రమాదవశాత్తు మృతిచెందిన నేపథ్యంలో, ఆయన కుటుంబానికి పార్టీ అండగా నిలిచింది. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన లోకేష్ కుటుంబానికి ఆదివారం తాడేపల్లిలో జరిగిన కార్యక్రమంలో రూ.5 లక్షల చెక్కును అందజేశారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, చంద్రగిరి నియోజకవర్గ ఇన్చార్జి ఆధ్వర్యంలో ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు ఈ చెక్కును లోకేష్ సతీమణి యామినికి అందజేశారు.

పార్టీ కార్యకర్తల సేవలు మరిచిపోలేనివని, ప్రతి కార్యకర్త కుటుంబ సభ్యుడే అనే భావనతోనే జనసేన ముందుకు సాగుతుందని దేవర మనోహర్ మీడియాతో పేర్కొన్నారు. కష్టసమయంలో కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలవడం పార్టీ సంప్రదాయమని తెలిపారు. లోకేష్ కుటుంబానికి జనసేన ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

చంద్రగిరి నియోజకవర్గంలో జనసేన కార్యకర్తకు తొలిసారిగా ప్రమాద భీమా చెక్కు జారీ కావడం విశేషం. ఈ సహాయానికి కీలక కారణం వాలంటీర్ హరి చేసిన కృషి, నిబద్ధత అని ఇన్చార్జి దేవర మనోహర్ అభినందించారు. కార్యకర్తల పట్ల పార్టీ చూపుతున్న ఈ దృక్పథం సేవాస్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనమని ఆయన తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com