గుంటూరు, (జనస్వరం) : మాజీ భారతదేశ పార్లమెంట్ సభ్యులు, సంఘ సంస్కర్త, వెనకబడిన తరగతుల వారి తలరాతలు మార్చిన జాతీయ బీసీ కమీషన్ మాజీ చైర్మన్ బిందేశ్వరి ప్రసాద్ మండల్ ( బీ పీ మండల్ ) విగ్రహావిష్కరణ దిమ్మెను కూల్చివేసిన ప్రభుత్వ తీరును ఖండిస్తూ ఈ రోజు అమరావతి రోడ్డు చిల్లీస్ డాబా వద్ద జనసేనపార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించటం జరిగినది. ఈ కార్యక్రమంలో స్టేట్ ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ బీపీ మండల్ విగ్రహం ఏర్పాటు చేయాలని లేనియెడల నిరాహార దీక్ష చేస్తామని జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కి హెచ్చరించడం జరిగినది. అలాగే గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ బీపీ మండల్ విగ్రహం నిర్మాణాన్ని కూల్చివేయటం బీసీలను అవమానించడం అని కొనియాడారు. ఈ విగ్రహం నిర్మాణాన్ని మరల పూర్తి చేయాలని లేనియెడల జనసేనపార్టీ తరఫున నిహార దీక్ష, రాస్తారోకలు చేస్తామని చెప్పడం జరిగినది. అధికార పార్టీ వారు బీసీలను ఆదరించే పార్టీ మాది అని, వాటికి గౌరవం మా పార్టీ వల్లే అని డొల్ల పలుకులు పలుకుతూ ఇలా బీసీ నాయకుడిని అవమానపరచడం ఎంత మటుకు సమంజసం అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు స్టేట్ కార్యదర్శి నాయు్బ్ కమాల్, జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, ప్రధాన కార్యదర్శి నారదాసు రామచంద్ర ప్రసాద్, ఆళ్ళ హరి, కార్యదర్శి నక్కల వంశీ, కొర్రపాటి నాగేశ్వరరావు, మధు లాల్, శ్రీపతి భూషయ్య, తన్నీరు గంగరాజు, రాజేష్, సాలేటి పుల్లారావు, తుమ్మల నరసింహారావు, కొత్తకోట ప్రసాద్, నాని, రాంబాబు, చక్రి, సుభాని, హనుమ నాయక్, పవన్ కళ్యాణ్, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.