Logo
Date of Publish : 27 December 2022, 4:47 pm
Editor : Sake Naresh

పెన్షన్ తొలగిస్తామని నోటీసులు ఇచ్చిన బాధితుల తరుపున జనసేనపార్టీ నిరసన కార్యక్రమం

      పెందుర్తి ( జనస్వరం ) : 88 వార్డ్, యాదవ్ జగ్గరాజుపేట గ్రామంలో సుమారు 72 పెన్షన్ దారులను తొలగిస్తామని నోటీసులు ఇచ్చిన ప్రభుత్వ వైఖరికి నిరసనగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక నాయకులు వబ్బిన జనార్ధన శ్రీకాంత్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలు నుండి వీరికి పెన్షన్లు వేరువేరు ప్రభుత్వాలు ఇస్తూ వస్తున్నాయని, ఇప్పుడు ఈ యొక్క వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కొత్త కొత్త నిబంధనలు తీసుకుని వచ్చి పెన్షన్లు తీసివేయడాన్ని జనసేన పార్టీ ద్వారా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. గత 18 సంవత్సరాల నుండి తీసుకుంటున్న పెన్షన్ లును ఇప్పుడు కొత్త నిబంధనలు చూపించి తొలగించడానికి ప్రభుత్వానికి ఎటువంటి హక్కు ఉందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నామన్నారు. వృద్ధులు, వితంతువులు పెన్షన్లు తీయడంతో పాటు అంగవైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగుల పెన్షన్లు కూడా తీయడాన్ని ఇక ప్రభుత్వాన్ని రాజన్న ప్రభుత్వం అంటామా లేక రాక్షక ప్రభుత్వం అంటామా ప్రజలే చెప్పాలని, వీరందరూ తరపున ఈరోజు సచివాలయం అడ్మిన్ కి త్వరగా వీళ్ళందరికీ పెన్షన్ లు వచ్చేలాగా అమలు చేయాలని వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు. వీరికి తర్వాత నెలలో పెన్షన్ ఇవ్వలేని యెడల వీరు తరుపున జనసేన పార్టీ ప్రభుత్వంపై మరింత ఒత్తిడి వచ్చేలాగా కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ యొక్క పెన్షన్ మీద ఆధారపడే మీరు జీవనం సాగుతుంది కావున మీడియా ప్రతినిధులు కూడా మాకు సహకరించి ఈ యొక్క సమస్యను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకుని వెళ్లాలా కృషి చేయాలని, స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గారికి, స్థానిక కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడు గారి కి ఎన్నికల్లో ప్రజలు తాలూకు ఓట్లు కావాలి కానీ ప్రజా సమస్యల మీద పట్టవా అని ప్రశ్నిస్తూ మీరిద్దరూ కూడా ఈ యొక్క గ్రామంలో పర్యటించి వీరికి పెన్షన్ వచ్చేలాగా కృషి చేయాలని, లేని యెడల రేపు రాబోవు రోజుల్లో ప్రజల వ్యతిరేకతను ఓటు రూపంలో మీకు చూపించవలసి వస్తుందని హెచ్చరిస్తున్నామని చెప్పడం జరిగింది. స్థానిక నాయకులు చిన్నా గారు మాట్లాడుతూ మా యొక్క గ్రామంలో ఈ యొక్క పెన్షన్ లకు నోటీసులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, పేద ప్రజల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వాన్ని దుశ్చర్య పరిగణిస్తూ తప్పకుండా రావే రోజుల్లో ఈ యొక్క పేద ప్రజల వెనకాల జనసేన పార్టీ ఉంటుందని, పేద ప్రజల కోసం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పూర్తితో ఎంతవరకైనా వెళ్తామని మీ అందరికీ మాటిస్తామని మాట్లాడం జరిగింది. ఈ కార్యక్రమంలో అశోక్, బాబురావు, ప్రసాద్, గోపి, చలం, చిన్నారావు, మరియు జనసైనికులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com