శేరిలింగంపల్లి ( జనస్వరం ) : జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా శేరిలింగంపల్లి నియోజక వర్గ ఇంఛార్జి గౌరవ డాక్టర్ మాధవరెడ్డి ఆదేశాల మేరకు మియాపూర్ డివిజన్ అద్యక్షులు హరినాయక్ నాయకత్వంలో స్థానిక మియాపూర్ డివిజన్ లోని నడిగడడ్డ తండా నందు మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ మాధవ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని పర్యావరణాన్ని పరిరక్షించే విధానమే సిద్ధాంతంగా ఉన్న ఏకైక పార్టీ జనసేన పార్టీ అటువంటి సిద్దాంతంను స్ఫూర్తిగా తీసుకొని ప్రజారోగ్యాన్ని ప్రాథమిక అంశంగా తీసుకొని మొక్కల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసిన మియాపూర్ డివిజన్ అధ్యక్షులు హరి నాయక్ గారిని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ డివిజన్ కోఆర్డినేటర్లు వీర మహిళలు, జన సైనికులు పాల్గొని విజయవంతం చేయటం జరిగింది.