Logo
Date of Publish : 02 October 2022, 4:02 pm
Editor : Sake Naresh

రాయపరెడ్డి కృష్ణ ఆధ్వర్యంలో మాడుగుల నియోజకవర్గంలో ఘనంగా జనసేనపార్టీ కార్యాలయం ప్రారంభం

          మాడుగుల ( జనస్వరం ) : మాడుగుల నియోజకవర్గం మాడుగుల ఘాట్ రోడ్ జంక్షన్ లో జనసేన నాయకులు రాయపరెడ్డి కృష్ణ గారి ఆధ్వర్యంలో జనసేన నూతన కార్యాలయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర జనసేన నాయకులు, వీర మహిళలు ముఖ్య అతిథులుగా విచ్చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని, ముందుగా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ గారి చిత్రపటానికి పుష్పాలతో నివాళులర్పించారు. అనంతరం సభను ఉద్దేశించి ఎలమంచిలి నియోజకవర్గ ఇన్చార్జి విజయ్ కుమార్, కోన తాతారావు మాట్లాడుతూ మాడుగుల నియోజకవర్గంలో ఇంతవరకు ఏ పార్టీ అధికారంలో ఉన్న ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగాను, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న బూడి ముత్యాల నాయుడు  రెండు సార్లు ఎమ్మెల్యే అయిన నియోజకవర్గానికి ఒరిగిందేమీ లేదని కనీసం రోడ్లు కూడా సరిగా లేవన్నారు. రాష్ట్రంలో పంచాయతీలు పరిస్థితి, ముఖ్యంగా మీ నియోజకవర్గంలో పంచాయతీల పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. కనుక మీకు ప్రజలు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించాలని మీ వలన నియోజకవర్గానికి ఒరిగేది ఏమీ లేదని, మాడుగుల నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు కనీసం ఏమైనా చేశారా ఒకసారైనా ఆలోచించుకోవాలని బూడి ముత్యాల నాయుడు గారిని ప్రశ్నించారు. మాడుగుల నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే జనసేనను కచ్చితంగా మాడుగులలో గెలిపించుకోవాలని జన సైనికులకు పిలుపునిచ్చారు. నాలుగు మండలాల నుంచి సుమారుగా 1500 వరకు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్చార్జి పసుపులేటి ఉషాకిరణ్, అరుకు పార్లమెంటరీ ఇన్చార్జి వంపూరి గంగులయ్య, జీవీఎంసీ జనసేన ఫ్లోర్ లీడర్ బి శెట్టి వసంత లక్ష్మి, లీగల్ సెల్ సభ్యురాలు కరణం కళావతి, ఉత్తరాంధ్రజనసేన నాయకులు ముక్క శ్రీను, గుర్రాలు శ్రీనివాసు, జనసేన నాయకులు కాదా శ్రీను, సోమశేఖర్, జనసేన ఐటీ విభాగం భరత్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com