నెల్లూరు ( జనస్వరం ) : రెండు రోజుల క్రితం జనసేన నుండి కేతం రెడ్డి వినోద్ వైసీపీలో చేరిన విషయం అందరికీ తెలిసిందేనని, ఆయన చేరికతో వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న వైసీపీ జిల్లా అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఓటమి తప్పదని, నెల్లూరులో రాజకీయాలు హుందాతనంగా చేయాలని వినోద్ రెడ్డికి స్క్రిప్ట్ ఇచ్చి మనోహర్ గారిని టార్గెట్ చేస్తూ జనసేన పార్టీ మీద బురద జల్లే విధంగా మాట్లాడించడం సిగ్గుచేటు అన్నారు. ఈ స్క్రిప్ట్ ఇచ్చింది సజ్జల భార్గవా లేకపోతే వైసీపీ జిల్లా అధ్యక్షుడా. ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటకు వెళ్లడం జరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జనసేన పార్టీలో ఎలాంటి పదవులు లేకుండా ఉన్న వ్యక్తిని వైసీపీలోకి తీసుకోవడాన్ని నెల్లూరు ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. వీపీఆర్ లాంటి పెద్ద వ్యక్తి కూడా ఇలాంటి వాళ్ళ చేత ప్రెస్ మీట్ లు పెట్టించటం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం అన్నారు. వైసీపీ వారు వ్యక్తిగత విమర్శలు చేస్తామంటే తాము కూడా రెడీగానే ఉన్నామన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటామని, రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడుతూనే ఉంటామన్నారు. వైసీపీ నేతలు తమపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తే తాము తిప్పుకొట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
వైసీపీ నుంచి ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటికి వచ్చేసారంటే జిల్లాలో వైసీపీ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుందన్నారు. ఎన్ని డబ్బులు ఉన్నా ప్రజా వ్యతిరేకతతో ఓడిపోవాల్సిందే అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతంగా కరెంటు బిల్లులు పెంచేసారని, చీప్ లిక్కర్ తో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. ఉద్యోగస్తులకు సమయానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి దాపొదించింది అన్నారు. సంక్షేమ పథకాలు అని చెప్పి పై జేబులో 1000 రూపాయలు పెట్టి కింద జేబులో నుంచి 10000 రూపాయలు లాక్కుంటున్న చరిత్ర ఈ వైసీపీ ప్రభుత్వానిదన్నారు.. కష్టాలు, కన్నీళ్లు తప్ప ఈ ప్రభుత్వంలో ఏమి లేవన్నారు. వైసీపీకి ఓటు వేస్తే మన భవిష్యత్తును మనం నాశనం చేసుకున్నట్లేనని ఎద్దేవా చేశారు. జనసేన జిల్లా నాయకత్వం అంతా ఏకతాటిపైకి వచ్చి కేతం రెడ్డి వ్యవహార శైలిపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో జనసేన ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్, కావలి నియోజకవర్గం ఇంచార్జ్ అలహరి సుధాకర్, సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్చార్జ్ ఉయ్యాల ప్రవీణ్ కుమార్, నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, సర్వేపల్లి సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్, కోవూరు సమన్వయకర్త శ్రీహరి రెడ్డి, రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ , జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా, తదితరులు పాల్గొన్నారు.