పార్వతీపురం ( జనస్వరం ) : పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం సవర గోపాలపురం, సవర గూడ గిరిజన గ్రామాలో ఈరోజు గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన కార్యక్రమన్ని ప్రారంభించారు. గిరిజన నియోజకవర్గ మైన పాలకొండలో అనేక మారుమూల గిరిజన ప్రాంతాల్లో పర్యటించి జనసేన పార్టీ బలోపేతం చేసేందుకు మొదటి దశగా వందరోజుల కార్యక్రమానికి వీరఘట్టం మండలం జనసేన పార్టీ నాయకులు శ్రీకారం చుట్టారు. గిరిజన ప్రాంతాల్లో – గుడిసె గుడిసె కు జనసేన పార్టీ మ్యానిఫెస్టో మరియు సిద్దాంతాలు గిరిజన ప్రజలకు అర్ధమైన రితీలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు మత్స.పుండరీకం, జనసేన జాని, కర్ణేన సాయి పవన్ వివరించారు. గిరిసేన – జనసేన జనం వద్దకు జనసేన కార్యక్రమంలో భాగంగా మత్స. పుండరీకం మాట్లాడుతూ ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరిని కలిసి ముఖ్యంగా మహిళలకు అర్ధమైన రీతిలో జనసేన పార్టీ మేనిఫెస్టో వివరించడం జరిగింది. గిరిజన ప్రజల దగ్గరకి వెళ్లి పలు కుటుంబాలను కలిసి జనసేన పార్టీ సిద్ధాతాలు గురించి వివరంగా చెప్పడం జరిగింది. గిరిసేన – జనసేన కార్యక్రమం ద్వారా ప్రజలునుండి అపూర్వమైన స్పందన లభిస్తోందన్నారు. గత ఎన్నికల సందర్భంగా ఒక్క ఛాన్స్ జగన్ కి ఇచ్చాం అని ఓటేసిన పాపానికి నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటాయని, రేషన్ బియ్యం మాత్రం ఇస్తున్నారు ఇంకేమి ఇవ్వడం లేదని, గిరిజన ప్రాంతాల్లో పండించే పంటలకు గిట్టుబాటు ధరలు లేవని అలాగే స్థానికంగా పనులు లేక సుదూర ప్రాంతలకు వలసలు వెళ్లిపోతున్నము అని గిరిజన మహిళలు జనసైనికులకు చెప్పారు. వీటికి జనసైనికులు సమాధానం ఇస్తూ జనసేన పార్టీ మేనిఫెస్టో లో గిరిజన ప్రాంతాల్లోని ఆహార పంటలకు, గిరిజన ఉత్పతులు తయారు చేసేoదుకు స్థానికంగా ఉంటూ ఉద్యోగ, ఉపాధి కల్పన కల్పిస్తుంది అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో గాజుగ్లాస్ గుర్తు కి మీ అమూల్యమైన ఓటును వేసి జనసేన పార్టీ గెలిపించాలని గిరిజన మహిళలను కోరారు. గిరిసేన – జనసేన కార్యక్రమంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు దూసి ప్రణీత్, గేదల రవి, నిమ్మక చిన్న, కోడి వెంకటరావు నాయుడు, వావిలపల్లి నాగభూషన్ పాల్గొన్నారు.