Search
Close this search box.
Search
Close this search box.

అంగన్వాడీల నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపిన జనసేన పార్టీ నాయకులు

   ఎమ్మిగనూరు ( జనస్వరం ) : అంగన్వాడి టీచర్స్, హెల్పర్స్, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు.  జనసేన నాయకులు పార్టీ తరుపున సంఘీభావం తెలపడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు కరణం రవి, రాహుల్ సాగర్, లు మాట్లాడుతూ… సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యుటి ఇవ్వాలని, గత ఆరు నెలల నుండి పెండింగ్లో పెట్టిన సెంటర్ అద్దెలు, టిఏ బిల్లులు తక్షణం చెల్లించాలని కోరారు. ఆయాల ప్రమోషన్లకు వయోపరిమితి 50 సంవత్సరాలకు పెంచి, రాజకీయ జోక్యాన్ని నివారించాలని, మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించి వేతనాలు, ప్రమోషన్లు కల్పించాలని, ఫేస్ రికగ్నైజేషన్ యాప్ రద్దు చేయాలని కోరారు. సర్వీసులో ఉండి చనిపోయిన అంగన్వాడీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, బీమా అమలు చేయాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు చెల్లించాలన్నారు. వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వానికి మొరపెట్టుకున్న ఏ సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చర్చల పేరుతో కాలయాపన తప్ప సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని అన్నారు. నిధి లేని పరిస్థితుల్లో అంగన్వాడి కార్మికులు నిర్వహిక సమ్మెలోకి వెళ్లడం జరిగిందని తెలిపారు. నవరత్నాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అందరికీ బటన్ నొక్కడం తప్ప అంగన్వాడీలకు చేసింది గుండు సున్నా అని అన్నారు. తెలంగాణలో అంగన్వాడీలకు 13,650/- చెల్లిస్తుంటే, అదనంగా చెల్లిస్తానన్న జగనాంధ్రప్రదేశ్లో 11500/- చెల్లిస్తూ, ఆయాలకు ఏడు వేలు మాత్రమే చెల్లిస్తున్నారని విమర్శించారు. అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా చూపిస్తూ ప్రభుత్వం అమలు చేసే అన్ని సంక్షేమ పథకాలనుండి జగన్ ప్రభుత్వం దూరం పెట్టిందని, జీతాలు చెల్లించేటప్పుడు మాత్రం మీకు ప్రభుత్వానికి సంబంధం లేదంటూ వ్యవహరిస్తుందని విమర్శించారు. పిల్లలకు, బాలింతలకు నాణ్యతలేని బాలామృతం, గుడ్లు, చిక్కీలు సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడం మానేసి, విజిట్ల పేరుతో ఫుడ్ కమిషనర్, అధికారులు అంగన్వాడీలను వేధిస్తున్నారన్నారని. ఆవేదనవ్యక్తంచేశారు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ (ఎఫ్.ఆర్.ఎస్) వచ్చాక అంగన్వాడీ సెంటర్లో పిల్లల పౌష్టికాహారం పని పక్కకుపోయి బాలింతలు చుట్టూ ఇళ్లకు, హాస్పిటల్స్ చుట్టూ అంగన్వాడీలు తిరగాల్సివస్తుందన్నారు. తక్షణ అన్ని యపులను కలిపి ఒకే యాప్ చేయాలన్నారు. 2017 నుండి టీఏ బిల్లులు చెల్లించికపోతే ఎలా పనిచేయాలని ప్రశ్నించారు. ఆయాల ప్రమోషన్ల విషయంలో రాజకీయ జోక్యం పెరిగిపోయిందని అన్నారు. డిసెంబర్ 11వ తేదీ జరిగిన చర్చలు సానుకూలంగా పరిష్కారం కాకపోవడంతో నేటి నుండి సమ్మె చేయవలసిన పరిస్థితికి కారణం ప్రభుత్వమే అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలని కోరారు. లేనిపక్షంలో అంగన్వాడీలు చేసే న్యాయమైన పోరాటానికి జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు షబ్బీర్, వినయ్, మల్లికార్జున, మురళి, ఎల్లప్ప, శ్యామ్, పరశురాం, వెంకటేష్, పవర్ స్టార్ రాజు, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way