పెందుర్తి ( జనస్వరం ) : పెందుర్తి నియోజకవర్గం స్థానిక నాయకులు వబ్బిన జనార్దన శ్రీకాంత్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వాలంటరీ వెంకటేష్ చేతిలో మన్నించిన కీ శే వరలక్ష్మీ కుటుంబాన్ని పరామర్శించి బోరశ ఇచ్చిన తర్వాత వారి కుటుంబ పై స్థానిక వైఎస్ఆర్సిపి నాయకుల ప్రవర్తన తీవ్రంగా ఖండిస్తూ, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు పెందుర్తి నియోజకవర్గం లో ఉన్న వాలంటీర్లు అందరి యొక్క పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్లని చూపించాలని, మీరు ఎటువంటి వెరిఫికేషన్ చేయకుండా వాలంటరీస్ ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఈరోజు వరలక్ష్మి గారు చనిపోవడానికి పరోక్షంగా బాధ్యులు అయ్యారని, ఇప్పటివరకు స్థానిక కార్పొరేటర్ గాని స్థానిక ఎమ్మెల్యే ఆ కుటుంబాన్ని పరామర్శించకుండా మీ యొక్క కార్యకర్తలతో మీ యొక్క సొంత ఛానల్ లో వెంకటేష్ అనే వ్యక్తి ఆ క్లస్టర్ తాలూకా వాలంటరీ కాదు అని, వేరే క్లస్టర్ కు సంబంధించిన వ్యక్తిని చెప్పడం చాలా దారుణమని, పోలీస్ స్టేషన్ లో క్రైమ్ రికార్డులు ఉన్న వ్యక్తికి మీరు ఒక వాలంటరీ ఉద్యోగం ఇవ్వడం ఆ వ్యక్తి సమాజంలో తిరగడం వల్ల ఈరోజు వరలక్ష్మి గారిని ఆ కుటుంబo కోల్పోవడం జరిగిందని, మీకు దమ్ము ధైర్యం చిత్తసిద్ధి ఉంటే పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన విషయాలు పై ఆత్మ విమర్శ చేసుకోవాలి, ప్రజలు కూడా చైతన్యవంతులై ఎవరైనా మీకు సంఘవిద్రోహులుగా కనిపిస్తే కళ్యాణ్ గారు చెప్పినట్లు స్థానిక పోలీస్ స్టేషన్లో గాని, జనసేన పార్టీ నాయకులు గాని మీ గ్రామంలో ఉన్న పెద్దలకి తెలియజేయాలని కోరడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com