ఎమ్మిగనూరు ( జనస్వరం ) : జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు సిల్వరి వెంకటేష్, గారి భార్య సౌజన్య, గారు ఇటీవలే కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆమెకు జనసేన పార్టీ నాయకులు రాహుల్ సాగర్, కాసా రవి ప్రకాష్, కర్ణం రవి, లు కలసి పది వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ కోసం కృషి చేస్తున్న జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు తమ కుటుంబ మనిషిగా భావిస్తామని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఇంత పెద్ద కుటుంబంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా తమకు తోచిన విదంగాలో సహాయం చేయడంలో ముందుంటామని అన్నారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తితో రాబోయే రోజుల్లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు ఎటువంటి ఇబ్బందులకు గురైనా తమకు తోచిన విధంగా సహాయం చేస్తామని తెలిపారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com