నెల్లూరు ( జనస్వరం ) : జిల్లా కోర్టు ఆవరణ యందు భూ హక్కుల చట్టం 27/2023 ను వ్యతిరేకిస్తూ న్యాయవాదులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు జనసేన పార్టీ తరఫున నెల్లూరు జిల్లా నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడంలో ప్రథమ స్థానంలో రాష్ట్రం నిలిచింది. స్థానిక ఎమ్మార్వో సంతకంతో భూహక్కును నిర్ణయించడం అనేది సబబు కాదు.అదే విధంగా ఆ హక్కును ప్రశ్నించాలంటే ఆశ్రయించాలంటే హైకోర్టులో మాత్రమే అనుమతులు వేయడం సబబు కాదు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక 100 రోజులతో ముగియనున్న వీరి అదికారాన్ని కాలంలో శాశ్వతంగా అధికారంలోకి రాకుండా చేయాల్సిన బాధ్యత అయితే ఉంది. బాధితులకు కష్టనష్టాలను మనసులో ఉంచుకొని న్యాయవాదులు చేస్తున్న న్యాయపోరాటానికి మద్దతుగా జనసేన పార్టీ ఉంటుంది. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, నాయకులు నాగబాబు, నాదెండ్ల మనోహర్, అజయ్ గారికి తెలియపరచి వారి సమస్య పరిష్కరించే వరకు కూడా జనసేన పార్టీని తరఫున నిలుస్తామని తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలో జనసేన పార్టీ జిల్లా లీగల్ సెల్ ఇంచార్జ్ చదలవాడ రాజేష్,,జనసేన నాయకులు కాకు మురళి రెడ్డి,అడ్వకేట్స్ రమేష్ ప్రతాపు,శ్రీనివాసులు, శేఖర్, శ్రీను,మధు,ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు జనసేన పార్టీ నుంచి జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, జిల్లా ఉపాధ్యక్షులు సుదీర్ బద్దిపూడి, కోవూరుటేకర్ గుడి హరి రెడ్డి, జనసేన సీనియర్ నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏటూరు రవి, వీర మహిళ నాగరత్నం, రేణుక, హైమావతి, ప్రశాంత్ గౌడ్, శరవణ, కాపు సంక్షేమ సేన జిల్లా అధ్యక్షులు సుధా మాధవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సందీప్, ఖలీల్, కేశవ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com