జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా శేరిలింగంపల్లి నియోజక వర్గ ఇంఛార్జి గౌరవ డాక్టర్ మాధవరెడ్డి ఆదేశాల మేరకు 110చందానగర్ డివిజన్ అద్యక్షులు అరుణ్ కుమార్ మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడుకొండలు గారి నాయకత్వంలో స్థానిక జనసేన పార్టీ ఆఫీసు నందు PJR స్టేడియం వద్ద ఉచిత కంటి వైద్య శిభిరం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక కాలని వాసులు మరియు పేద బడుగు బలహీనర్గాల ప్రజలు విశేషంగా పాల్గొని ఉచిత కంటి వైద్య శిభిరం సేవలను వినియోగించుకోవడం జరిగింది. స్వతహాగా నేత్ర వైద్యలైన డాక్టర్ మాధవ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని కంటి వైద్య పరీక్షల అనంతరం కళ్లజోళ్లు పంపిణీ చేయడం జరిగింది. కంటి చూపు సమస్యలతో బాధపడే వారికి మెరుగైన సేవలందించేందుకు రానున్న కాలంలో మరన్నీ ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నామని తెలియ చేశారు. అదేవిధంగా పరీక్షల అనంతరం వారి కంటి చూపుకు అవసరమైన కళ్లజోళ్లను 2-4 రోజులలో అందిస్తామని తెలియచేశారు అలాగే సమాజం పట్ల బాధ్యత, సేవ చేసే లక్షణం కలిగి ఉండటం అరుదుగా ఉన్న నేటి సమాజంలో జనసేన పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ జనసేన పార్టీ డివిజన్ కోఆర్డినేటర్లు వీర మహిళలు, జన సైనికులు పాల్గొని విజయవంతం చేయటం జరిగింది.