Logo
Date of Publish : 29 November 2023, 10:46 pm
Editor : Sake Naresh

నెల్లూరులో జనసేనపార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం

    నెల్లూరు ( జనస్వరం ) : సత్యనారాయణపురం, నెల్లూరు సిటీ, ఐదవ డివిజన్లో జనసేన నాయకులు పార్టీ పతాకావిష్కరణ చేశారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు సిటీలో జనసేన పార్టీ మద్దతు దారులు గాని పవన్ కళ్యాణ్ అభిమానులను అధికసంఖ్యలో ఉన్నారు. క్రియాశీలక సభ్యత్వం లో కూడా దాదాపుగా 1500 దాటింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన మార్కు చూపే విధంగా చిరంజీవి యువత సీనియర్ నాయకులు జనసేన పార్టీ క్రియాశీల సభ్యులు అందరూ కలిసి జనసేన పార్టీ ఆశయాలను పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను ప్రతిగడపకు చేర వేసే విధంగా సిటీ నిర్దేశకులు వేములపాటి అజయ్ గారి ఆధ్వర్యంలో పనిచేస్తాం. నెల్లూరు సిటీ లోని పలు ముఖ్య కూడల్ల లో జనసేన పార్టీ జెండాలను స్థాపించి ప్రజా ప్రభుత్వం స్థాపిస్తే జనసేన పార్టీ తరఫున ప్రజలకు మేలు జరుగుతుందనే విషయాన్ని అందరికి తెలియజేసే విధంగా త్వరలో కరపత్రాలతో ఇంటింటా ప్రచారానికి శ్రీకారం చేస్తాం. ఓటీపీలు ఇవ్వడం వ్యక్తిగత సమాచారం దోపిడీకి గురవుతుందని పలుమార్లు పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించిన పట్టించుకోకపోగా ప్రతిపక్షాలు ఓటిపిలు గూర్చి రాద్ధాంతం చేస్తున్న సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారికి వైసిపీ నాయకులకి వర్తించేట్లులేదు.వైసిపి నాయకులకు ఒక చట్టం ప్రతిపక్షాలకు,ప్రజలకు ఒక చట్టం లా ఉంది.

ప్రస్థుతం వాలంటీర్లు 42 పేజీల జగన్ పుస్తక ప్రచారంలో బిజీగా ఉన్నారు ప్రతి ఇంటికి ప్రభుత్వ ఖజానాతో వైసిపి ఫ్రీ ప్రచారం సాగుతుంది. ఈ నాలుగు సంవత్సరాల వైసిపి దౌర్జన్యాలను, దోపిడీలను, బాధలను అర్థం చేసుకొని బంగారు భవిత కై పని చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ఈసారి అవకాశం ఇచ్చి ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలందరూ సహకరించాల్సిందిగా పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో మా నాయకులు నాగబాబు, నాదెళ్ల మనోహర్, సిటీ నిర్దేశికులు అజయ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీని ఒక బలమైన శక్తిగా తయారు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో పాటు జనసేన సీనియర్ నాయకులు, చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏటూరి రవికుమార్, జనసేన జిల్లా అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి, జనసేన సీనియర్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, చిరంజీవి యువత అధ్యక్షులు ఈగి సురేష్ , జిల్లా కార్యదర్శి, కోవూర్ కేర్ టేకర్ గుడి హరి రెడ్డి,5 వ డివిజన్ నాయకులు మోష, నగర కార్యదర్శి హైమావతి,వరుణ్ తేజ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గుర్రం కిషోర్, ప్రభాకర్,11 వ డివిజన్ ఇన్ చార్జీ రమణ, నగర కార్యదర్శి చిన్ని పృద్వి, నగర కార్యదర్శి ఊటుకూరు రమేష్, 11వ డివిజన్ ఉపాధ్యక్షులు కొండ వనబాబు, 11 వ డివిజన్ కార్యదర్శి దత్తాత్రేయ, ఆరో డివిజన్ కే వెంకటరమణ, సుబ్బు, హరి, వరుణ్, పృద్వి, రాము, తరుణ్, ప్రశాంత్ గౌడ్, మౌనేష్, హేమచంద్ర యాదవ్, బన్నీ, షాజహాన్, ఖలీల్, కేశవ, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com