Logo
Date of Publish : 22 August 2023, 10:44 pm
Editor : Sake Naresh

జనసేనపార్టీ ఫ్లెక్సీ చించివేతపై పోలీసులకు కంప్లైంట్

          సర్వేపల్లి ( జనస్వరం ) : బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ ఈనెల 20వ తేది ఆదివారం సర్వేపల్లి నియోజకవర్గానికి సంబందించి సర్వేపల్లి గ్రామంలో చిరంజీవి యువత, పవన్ కళ్యాణ్ యువత అధ్యక్షుల నియామకం జరిగింది. అందులో భాగంగా వెంకటాచలంలోని సర్వేపల్లి క్రాస్ రోడ్డు వద్ద హైవే పక్కన జనసేన పార్టీ ఫ్లెక్సీ ఒకటి, మరొకటి తిక్కవరపాడు రోడ్డు సమీపంలో, మూడోవది సర్వేపల్లి గ్రామంలో ఫ్లెక్సీలను వేయడం జరిగింది. మూడు ఫ్లెక్సీలను ఈనెల 21వ తేది ఉదయం చూసే సరికి తిక్కవరపాడు, వెంకటాచలం హైవే దగ్గర ఉన్న ఫ్లెక్సీలను చించి వేయబడి ఉన్నాయి. ఈ విషయంపై ఈరోజు స్థానిక వెంకటాచలం పోలీస్ స్టేషన్ నందు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఎన్నోసార్లు జనసేన ఫ్లెక్సీలు, కటౌట్లను చించేస్తే వీటిపైన స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ లు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటివరకు వాటిపై విచారణ జరిపిన దాఖలలు లేవు. మళ్లీ ఈరోజు కూడా జనసేన ఫ్లెక్సీలు చించివేతపై స్థానిక వెంకటాచలం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. ఇవి మళ్లీ పునరావతం కాకుండా చూడాలని చెప్పి స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ద్వారా విన్నవించుకున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, అధికార పార్టీ నాయకులు ఫ్లెక్సీలకే భయపడి పోతున్నారంటే రేపు జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందనేటువంటి భయం వాళ్లలో పట్టుకుంది. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలం, జనసేన పార్టీ గొంతు, జనసేన పార్టీ గళం బలంగా వినిపిస్తుంది కాబట్టే వీళ్లకు ఎముకల్లో వీళ్ళ గుండెల్లో భయం పుట్టుకొచ్చి మా ఫ్లెక్సీ ను చించేస్తున్నారు. మీరు ఫ్లెక్సీలు చించేసినంత మాత్రాన ప్రజల్లో పెరిగిన ఆదరణ తగ్గిపోదు. మాకు ఇంకా ఆదరణ పెరుగుతుంది. ప్రజల్లో మార్పు వచ్చింది. రేపు రాబోయేది జనసేన కాబోయే ముఖ్యమంత్రి మా అధినేత పవన్ కళ్యాణ్ సర్వేపల్లి నియోజకవర్గం లో జనసేన పార్టీ విజయ కేతనం ఎగరవేస్తాం అని అన్నారు.  ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రహీం, చిరంజీవి యువత అధ్యక్షులు ఖాజా, పవన్ కళ్యాణ్ యువత అధ్యక్షులు అశోక్, ఉపాధ్యక్షులు సుమన్, జనసేన నాయకులు శ్రీహరి, అక్బర్, చిన్న తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com