Search
Close this search box.
Search
Close this search box.

జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి z కేటగిరి భద్రత కల్పించాలి : అనంతపురం జనసేనపార్టీ సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్

      అనంతపురం, (జనస్వరం) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ఇంటి దగ్గర, జనసేనపార్టీ ఆఫీస్ దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు గత రెండు రోజులుగా రెక్కి నిర్వహిస్తున్న సందర్భంగా, అధినేత వ్యక్తిగత సిబ్బంది జూబ్లీ హిల్స్ పోలీసు స్టేషన్లో పిర్యాదు చేయటం జరిగింది. దీనిపైన పూర్తి వివరాలు ఇంకా రావాల్సిన అవసరం ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రెడ్డి వెల్ఫేర్, డెవలప్మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ వాహనంగా ఒకటి గుర్తించినట్లు, మరోక వాహనం గుజరాత్ రాష్ట్ర రిజిస్ట్రేషన్ తో ఉన్నట్లు తెలుస్తున్నది. ఏది ఏమైనా దీని పైన తెలంగాణా పోలీసులు పూర్తిస్థాయిలో నిష్పక్షపాతమైన విచారణ జరిపి, వాస్తవాలను బహిరంగపరచాలని జనసైనికుల తరపున బలంగా డిమాండ్ చేస్తూన్నామని తెలిపారు. రాజకీయంగా ఎదుర్కోవాలి తప్పితే, భౌతిక దాడులకు పాల్పడితే మాత్రం, రాష్ట్రంలో దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని, రాజకీయాలలో వ్యక్తిగత దాడులు, భౌతిక దాడులు మంచి పద్ధతి కాదని, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి Z కేటగిరీ భద్రత యొక్క అవశ్యకతపై దృష్టి పెట్టాలని వైజాగ్ సంఘటన జరిగిన తరువాత భద్రత ఎంతైనా అవసరం ఉందని తెలిపారు. పవన్ కళ్యాణ్ కి రోజు రోజుకీ పెరుగుతున్న ప్రజాదరణ రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ శత్రువులు ఎక్కువగా ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ కి ప్రాణహాని ఉంటుందని భావించాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి మనకు అంటే జనసేన పార్టీకి పొత్తులో ఉన్న బిజేపి అధినాయకత్వంపై వత్తిడి తెచ్చి పవన్ కళ్యాణ్ కి Z కేటగిరీ భద్రత కోసం జనసేన పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు అందుబాటులో ఉన్న ట్విట్టర్ ద్వారా గాని మెయిల్స్ ద్వారా గాని, ఉత్తర రూపంలో గాని ప్రైమ్ మినిస్టర్ కార్యాలయంకి తెలియజేయండని సూచించారు. గత మూడు రోజులుగా జరుగుతున్న పవన్ కళ్యాణ్ నివాసం వద్ద రాజకీయ నాయకుల శత్రువుల కదలికలు మనకందరికీ ఆందోళనకరం ఉన్నాయి. కాబట్టి ఎంత త్వరగా పవన్ కళ్యాణ్ కి Z కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నామని బాల్యం రాజేష్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way