విజయవాడ ( జనస్వరం ) : పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ గారి ఆధ్వర్యంలో ఇంటింటికి రాబోయే మన జనసేన ప్రభుత్వo 27 వ రోజు కార్యక్రమం 54వ డివిజన్ అధ్యక్షులు కంది రాజా ఆధ్వర్యంలో వించి పేట గాంధీ బొమ్మ సెంటర్ వద్దనుండి ప్రారంభించి 54వడివిజన్ లోని పలు ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. పోతిన. మహేష్ గారు ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచుతూ జనసేన పార్టీ మేనిఫెస్టోలోని అంశాలను వైసిపి పార్టీలోని లోపాలను ప్రతి ఒక్కరికి తెలియజేశారు. పవన్ కళ్యాణ్ గారు సామాన్యుల తరఫున పోరాటం చేస్తున్నారని ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగుల నింపాలని దృఢమైన నిశ్చయంతో ముందుకు సాగుతున్నారని రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరగాలన్న అవినీతి లేని పాలన జరగాలన్న అది కేవలం పవన్ కళ్యాణ్ గారితోనే సాధ్యం అన్నారు. రాష్ట్రంలో వైసిపి పని అయిపోయిందని cm జగన్ ని నమ్మే పరిస్థితులు లేవని ప్రజలు జగన్ గారి నిజస్వరూపాన్ని గ్రహించారని రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాభవం తప్పదని తెలియజేశారు.
54 వ డివిజన్ అధ్యక్షులు కంది రాజా గారు మాట్లాడుతూ ఈరోజు జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన మహేష్ గారి ఆధ్వర్యంలో 54వ డివిజన్లోని గాంధీ బొమ్మల సెంటర్ పరిసర ప్రాంతాలలో పర్యటించడం జరిగిందని ముఖ్యంగా ఈ డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయని ఇక్కడ రోడ్లు గాని డ్రైనేజీ సిస్టం గాని సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ముఖ్యంగా ఈ డివిజన్ తో కనెక్టివిటీ ఉన్నటువంటి 55, 56 డివిజన్లో లకి సంబంధించినటువంటి రోడ్లు సరిగా లేక ప్రజలు ఆ రోడ్లలలో తిరగలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అదేవిధంగా ఈ డివిజన్లోని ఏ ఇంటికి వెళ్లిన ప్రతి ఒక్కరు కూడా ఒకే మాట చెబుతున్నారని జగన్ మళ్లీ రాకూడదని ఆ పాలన మాకు వద్దని ప్రతి ఒక్కరు చెప్తున్నారని అదేవిధంగా ప్రజలందరూ కూడా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ఈ నియోజకవర్గంలోని పోతిన మహేష్ గారికి అండగా నిలబడి రాబోయే రోజుల్లో జనసేన పార్టీని గెలిపించాలని ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది.
మల్లేపు విజయలక్ష్మి గారు మాట్లాడుతూ ఈరోజు ఇంటింటికి రావే మన జనసేన ప్రభుత్వ కార్యక్రమాలు 54 డివిజన్లో ఇంటింటికి తిరగడం జరిగిందని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి వైసీపి ప్రభుత్వం పోవాలని మాకు జనసేన ప్రభుత్వం రావాలని మాకు బలంగా తెలియజేయడం జరిగిందని ముఖ్యంగా ఇక్కడ చాలామందికి పెన్షన్ సరిగా రావడం లేదని ముఖ్యంగా కరెంట్ బిల్లులు ఎక్కువ వచ్చాయని ఏదో ఒక వంక చెప్పి మా పెన్షన్లు రద్దు చేస్తున్నారని మేము ఒక్క అవకాశం అని వైసిపి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చి మేము ఇబ్బంది పడుతున్నామని ఈసారి మేము ఆ ప్రభుత్వం యొక్క ఫ్యాన్ రెక్కలు విరగగొట్టే బాధ్యత కూడా తీసుకుంటామని అలాగే ఈసారి జనసేన పార్టీకి మా మద్దతు ఉంటుందని అదేవిధంగా పశ్చిమ నియోజకవర్గం లో పోతిన మహేష్ గారిని గెలిపించుకుంటామని ప్రజలందరూ కూడా మాకు చెప్పడం జరిగిందని మాట్లాడడం జరిగింది. . ఈ కార్యక్రమంలో పులిచేరి రమేష్ గారు, డివిజన్ అధ్యక్షులు సోమి గోవింద, ఏలూరు సాయి శరత్, సిగానంశెట్టి రాము , ఆకుల రవిశంకర్, , జగడం శ్రీనివాస్, ముద్దనా స్టాలిన్ శంకర్ సబిన్కర్ నరేష్, , తొత్తడి భరత్, బాదర్ల శివ ,g పవన్, పోలిశెట్టి శివ, తదితరులు పాల్గొన్నారు
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com