Logo
Date of Publish : 18 March 2026, 10:59 am
Editor : Sake Naresh

సూళ్లూరుపేటలో ఘనంగా జనసేన ఉద్యమి నమోదు కార్యక్రమం

సూళ్లూరుపేట, మార్చి 17, (జనస్వరం) : సూళ్లూరుపేట నియోజకవర్గంలోని మన్నారు పోలూరు గ్రామంలో టిడ్కో హౌసెస్ సమీపంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో “జనసేన ఉద్యమి నమోదు” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన జాతీయ మీడియా ప్రతినిధి, ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామంలోని ప్రతి ఒక్కరిని జనసేన ఉద్యమి సభ్యులుగా నమోదు చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నాయకులు తెలిపారు.

ఈ సందర్భంగా వేములపాటి అజయ్ మాట్లాడుతూ జనసేన పార్టీ తరఫున ఉద్యమి సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యకర్తలను నాయకత్వ స్థాయికి తీసుకువచ్చే రాజకీయ సంస్కృతి జనసేనలోనే ఉందని, యువతను రాజకీయాల్లోకి తీసుకురావాలనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారని తెలిపారు. పేదలకు ఇళ్ల కలను సాకారం చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించిన టిడ్కో హౌసింగ్ ప్రాజెక్టులను గత ప్రభుత్వం నిలిపివేసిందని విమర్శిస్తూ, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వాటిని పునరుద్ధరించి పేదలకు ఇళ్లను అందించేందుకు కట్టుబడి ఉందన్నారు. అదేవిధంగా గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ రహదారులు, పంచాయతీలకు నిధులు కల్పిస్తూ గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని జనసేన నాయకులు సుంకు సురేష్, మహబూబ్ బాషా, ఆవుల నాగేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల, జిల్లా నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, కారంపూడి కృష్ణారెడ్డి, జమీర్, రవికుమార్, ముని గిరీష్, చంద్రనిల్, శివ, బాలు, నరహరి, హర్ష, ప్రశాంత్ గౌడ్ తదితరులు, వీర మహిళలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన ఉద్యమి నమోదు కార్యక్రమాన్ని ప్రతి గ్రామానికి విస్తరించేందుకు కార్యకర్తలు ముందుకు రావాలని నాయకులు పిలుపునిచ్చారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com