
ఎచ్చెర్ల ( జనస్వరం ) : వచ్చే ఎన్నికలలో ఎచ్చర్ల నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలిపే లక్ష్యంగా నిరంతరం నియోజకవర్గంలో అనేక అనేక సమస్యలపై పోరాడుతూ, సేవా కార్యక్రమంలో ముందుంటున్నారు జనసేన నాయకురాలు కాంతిశ్రీ. జన సైనికులకు తోడుగా ఉంటూ, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూ, నియోజవర్గంలో కేడర్ ను ఉత్సాహంపరిచే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. కార్తీక మాసం సందర్భంగా ఆత్మీయ కలయిక, డొక్కా సీతమ్మ గారి వనభోజన కార్యక్రమం నిన్న బెజ్జిపురంలో 2000 వేల మందితో నిర్వహించారు. వనభోజనాలు పూర్తయిన తర్వాత బెజ్జిపురం జంక్షన్ నుంచి ఎచ్చెర్ల వరకు భారీ ర్యాలీ జనసైనికులతో కలిసి ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు కాంతిశ్రీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ , కాబోయే ఎచ్చెర్ల నియోజకవర్గం MLA కాంత్రిశ్రీ అమ్మ అంటూ నినాదాలు జనసైనికులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వహణ వైస్ ప్రెసిడెంట్ డా, విశ్వక్సేన్, కొచ్చర్ల జనసేన సర్పంచ్ బసవ గోవింద్ రెడ్డి, మండల నాయకులు పాల్గొన్నారు.