కాకినాడ సిటి ( జనస్వరం ) : జనసేన పార్టీ కార్యాలయంలో పి.ఏ.సి సభ్యుడు & కాకినాడ సిటి జనసేన పార్టీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ పత్రికా విలేఖరుల సమావేశంలో పాల్గొంటూ నిన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారి మత్స్యకార భరోసా పధకంలో భాగంగా వేటనిషేధంలో వారికి ఇచ్చే జీవనభృతి వగైరా చెప్పిన విషయాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమాల సభలో రాజకీయాలు ప్రస్తావిస్తూ దాన్ని రాజకీయ సభగా మార్చిన ఘనత ఆయనదే అన్నారు. ఆయనచేప్పే అబద్దాలు, చేసే మోసాలని ప్రజలు నమ్మే స్థితిలో లేరంటూ ఇచ్చింది గోరంత, చెప్పుకునేది కొండంత అని ఎద్దేవా చేసారు. ఈ సందర్భంగా ముత్తా శశిధర్ మాట్లాడుతూ దేశంలో విస్తారమైన తీరప్రాంతం కలిగిన రాష్ట్రంగా మన రాష్ట్రం ఉన్నదని అందుకే మరో మూడు పోర్టులు నిర్మించబోతున్నాం అని ముఖ్యమంత్రి శంఖుస్థాపనలు మాత్రమే చేసి వాటి ఊసు పట్టించుకోడంలేదని విమర్శించారు. మత్స్యకార భరోసా అంటూ వారికోసం అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం అని తన పత్రికలో పేద్ద ప్రకటన ఇచ్చి రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులందరినీ మోసం చేస్తున్నారన్నారు. తీరా చూస్తే రాష్ట్రంలో అతితక్కువగా కాకినాడ సిటిలో కేవలం 4117 మందిని అర్హులుగా లెక్కకట్టడం జరిగిందనీ, వారికి నిధులు విడుదల అయ్యాయో లేదో తెలియదన్నారు. అంటే కాకినాడ సిటిలో కేవలం అంతమందే మత్స్యకారులున్నారా అని ప్రశ్నించారు. పైగా రాష్త్రంలో లబ్దిదారులు గత సంవత్సరం కన్నా 25 శాతం ఈయేడు పెరిగారని చెప్పరనీ మరి కాకినాడలో ఆమేరకు పెరగకపోడంలో మర్మం ఏంటో ఆయనకే తెలియాలన్నారు. గణాంకాలను పరిశీలిస్తే డీజిల్ కు సబ్సిడీ రూ.6/- నుండీ రూ.9/- పెంచామని చెపుతున్నారనీ మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం లీటరుకి రూ. 31.69/- పన్నుల రూపంలో వసూలు చేస్తూ పేద మత్స్యకారులకి కేవలం 300 లీటర్లకు రూ.9/- ఇస్తున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇది మోసం కాదా అని అడిగారు. ఆర్.బి.కె ల ద్వారా వలలు, మందులు వగైరా అందచేస్తున్నామని ప్రకటనలో తెలిపారనీ మరి కాకినాడలో ఏ ఆర్.బి.కె ద్వారా ఇవన్నీ నాలుగువేల మంది మత్స్యకారులకి అందచేసారో తెలపాలని డిమాండ్ చేసారు. ఇతర ఏపధకాలు అందని వారికి ఈ పధకం ఇస్తామని చెపుతున్నారని అంటే కాకినాడ సిటిలో 4117 మందికి మాత్రమే ఎలాంటి పధకాలు అందలేదని చెపుతున్నారా అని అడిగారు. ఇరవై అయిదు వేల మందిని ఎన్రోల్ చేసామని చెప్పి నాలుగు వేలమందికే ఇవ్వడం చాలా దారుణమన్నారు. బతకడానికి 60 యేండ్లు దాటిన వేటకు వెళ్ళుతుంటే వారిని అనర్హులుగా భావిస్తే వారికి వృద్ధప్య పించనూ ఎందుకు మంజూరు చేయలేదు అని 18 యేండ్లు దాటలేదని కొంతమందికి తీసేసారనీ మరి వారికి అమ్మవొడి ఇచ్చి చదువుకోమని ప్రోత్సహించరెందుకని అడిగారు. గత కొన్నిరోజుల కిందట తమ నాయకుడు ఆదేశారమేరకు నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో తామంతా కలిసి మత్స్య శాఖ అధికారులకి ప్రతి ఒక్క మత్స్యకారునికీ జీవనభృతి అందచేయాలని కోరుతూ తగిన వివరాలతో వినతి పత్రాన్ని అందచేసామనీ, అయినా వాటిని పరిశీలించకుండా బుట్టదాఖలు చేయడం తీవ్రమైన విషయమని, రానున్న రోజుల్లో అనర్హులుగా తీసివేసిన ప్రతి మత్స్యకారుని ఇంటికీ తాను జనసేన పార్టీ తరపున వెళ్ళి ఈవిషయమై సంఘీభావాన్ని తెలియచేసి వారికోసం పోరాటం చేసి సాధిస్తామన్నారు, లేకపోటే ఈ వై.ఎస్.ఆర్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాకినాడ సిటి జనసేన పార్టీ అధ్యక్షుడు సంగిశెట్టి అశోక్, స్టేట్ జాయింట్ సెక్రెటరీ వాసిరెడ్డి శివ, జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ, సిటీ ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ & ఓలేటిరాము, ఆర్గనైజింగ్ సెక్రటరీ మడ్డు
విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ ర్యాలీ రాంబాబు, మత్స్యకారనాయకులు అమర్నాథ్, ఎల్లాజీ, జనసైనికులు పాల్గొన్నారు.