నూజీవీడు ( జనస్వరం ) : నూజివీడు పట్టణంలో సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ నిరవధిక సమ్మె చేస్తున్నారు. అందులో భాగంగా వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. నూజివీడు నియోజకవర్గం సమన్మయకర్త బర్మా.ఫణి బాబు సూచనల మేరకు వంట వార్పు కార్యక్రమంలో పాల్గొని జనసేన నాయకులు మద్దతు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ జనసేన నాయకులు పాశం నాగబాబు, సురిసెట్టి శివ, ఏనుగుల చక్రి, ముమ్మలనేని సునీల్ ఊప్పే నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com