ఉరవకొండ ( జనస్వరం ) : ఉరవకొండ నియోజక వర్గంలో క్రియ శీలాక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. జిల్లా కార్యదర్శి గౌతమ్ కుమార్ మాట్లాడుతూ జనసేన అద్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రవేశ పెట్టిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రతి ఒక్కరూ చేసుకొని చేసుకున్న ప్రతి కార్యకర్తకి భరోసా కల్పించడానికి ప్రమాదవశాత్తు మరణించిన వారికి 5లక్షల భీమా చెక్కు, ప్రమాదంలో గాయపడిటే 50 వేలు హాస్పిటల్ ఖర్చులు పార్టీ నుంచి సహాయం చేసేలా చూస్తారని తెలియచేశారు. క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం ఫిబ్రవరి 10 నుంచి 28 వ తేదీ వరకు ఉంటుందని సభ్యత్వo కావలసిన వారు జనసేన పార్టీ ఉరవకొండ నందు సంప్రదించలని తెలియచేశారు. ఈ కార్యక్రమం లో వజ్రకరూరు అద్యక్షులు కేశవ్, విదపనకల్ మండల అధ్యక్షులు గోపాల్, బెలుగుప్ప మండల్ అద్యక్షులు సుధీర్, జనసేన నాయకులు రాజేష్, హారిశoకర్ నాయక్,తిలక్,సురేష్,గోపి ,
నారాయణ, తిప్పయ్య కార్యకర్తలు పాల్గొన్నారు.