న్యూస్ ( జనస్వరం ) : కడపజిల్లాకు చెందిన జనసైనికుడు షైక్.గౌస్ భాష గత 8నెలల క్రితం కువైట్ కు వచ్చి ఒక కువైటి ఇంట్లో పనిచేస్తున్నాడు. కానీ ఆ కువైట్ వ్యక్తం అతనికి గత 6నెలలుగా జీతం ఇవ్వకుండా, చిత్రహింసలు పెడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేనపార్టీ కువైట్ సభ్యులు యర్రంశెట్టి హరిబాబురాయల్ చలించి అతను పడుతున్న బాధలు తెలుసుకుని తోటి జనసైనికులకు తెలపడం జరిగింది. వారు స్పందించి తోటి జనసైనికుడి కష్టం మన కష్టంగా భావించి అతనికి కావాల్సిన ఇండియాకు టికెట్, ఇంటికి చేరేవరకు ఖర్చులకు మొత్తం సమకూర్చడం జరిగింది. ఇందుకు సహకరించిన జనసేనపార్టీ కువైట్ సభ్యులు యర్రంశెట్టి.హరిబాబురాయల్, గ్రందే ప్రసాద్ రాయల్, శంకర్ కుంచా, షైక్అలీ, గంటా రమేష్ రాయల్, బల్లెపల్లి, శ్రీను రాయల్, మోడెం చిరంజీవి, చింతం మురళి లకు కృతజ్ఞతలు తెలిపారు. వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఎవరికీ ఏ కష్టం వచ్చిన జనసైనికులుమైన మేము వారికి తోడుంటామని, సహాయం చేస్తామని కువైట్ సభ్యులు తెలపడం జరిగింది.