విజయవాడ ( జనస్వరం ) : విజయవాడలో "ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం- ప్రజాస్వామ్య పరిరక్షణ” పేరిట అఖిలపక్ష సమావేశంలో జనసేనపార్టీ నుండి పిఎసి సభ్యులు కందుల దుర్గేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మదుసూధన్ రెడ్డి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి డా. వడ్లపట్ల సాయి శరత్ పాల్గొన్నారు. సాయి శరత్ మాట్లాడుతూ ప్రశ్నించిన ప్రతిపక్షాలపై, మీడియాపై, న్యాయస్థానాలపై, ప్రజా సంఘాలపై, ప్రజలపై, గృహ దహనాలు, విధ్వంసాలు, అత్యాచారాలు, హత్యలు, నిత్యకృత్యమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజాకీయ నాయకులపైనే కాకుండా, సామాన్యులపై కూడా ఇదే స్థాయిలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం ఎక్కువైపోయిందని విమర్శించారు. ఆఖరికి డ్వాక్రా మహిళలను బెదిరించి సభలకు తీసుకువెళ్తున్నారన్నారు. నల్ల చున్నీలు వేసుకు వస్తే బయపడి ఆడవారి అత్మగౌరవానికీ భంగం కలిగంచేలా ప్రవర్తిస్తూ వారి సభలకు కలం తీసుకెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంక్షలు పెట్టి కలానికీ, అమ్మాయిల చున్నీలకీ కూడా భయపడే పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే ఇంతకంటే ఘోరమైన పరిస్థితి లేదనీ ధ్వజమెత్తారు. ఏ రాష్ట్ర చరిత్రలో కూడా కనీవినీ ఎరుగని విధంగా ముఖ్యమంత్రి పరదాలు కట్టుకుని తిరగడం ఈ ఆంధ్ర రాష్ట్ర దౌర్భాగ్యమని సాయి శరత్ పేర్కొన్నారు. ఇటువంటి సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణకై ప్రతి ఒక్కరు దీక్షా కంకణ బద్దులై పోరాడాలని కోరారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com