Logo
Date of Publish : 14 November 2022, 4:47 pm
Editor : Sake Naresh

అనారోగ్యంతో బాధపడుతున్న బాలికకు ఆర్థిక సహాయం చేసిన జనసేన నాయకులు

          పూతలపట్టు ( జనస్వరం ) : ఐరాల మండలం, ఎగువ నాంపల్లిలో నివసిస్తున్న ఎం.అనూష అనే 18 ఏళ్ల బాలికకు ఎవరికి రానటువంటి శ్వాసకోశ వ్యాధితో గత రెండు సంవత్సరాలుగా బాధపడుతుంది. అనూష తల్లిదండ్రులు కూతురుని బతికించుకోవడం కోసం ఉన్న ఆస్తులను, పశువులను అమ్మి ఆసుపత్రులు చుట్టూ తిరిగిన తగిన వైద్యం చేయించలేకపోయారు. ప్రభుత్వ అధికారులకు, స్థానిక రూలింగ్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులను సంప్రదించిన ఎటువంటి ఉపయోగం లేకపోయింది. విషయం తెలుసుకున్న స్థానిక జనసేన నాయకులు వెంటనే వారి కుటుంబాన్ని పరామర్శించి తగిన సహాయం చేయగలమని హామీ ఇచ్చారు. ఐరాల మండలం మరియు పాకాల మండల జనసైనికులు సంయుక్తంగా కలిసి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో జనసేన పార్టీ తరపున, DMC హెల్పింగ్ హాండ్స్ తరపున వారికి సుమారు 50,000 రూపాయలను అందించారు. ఈ కార్యక్రమాన్ని వాసు రాయల్ మరియు రహమతుల్లా అందరితో మాట్లాడి సహాయం అందేలాగా చేశారు. అనూష తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ గారికి, జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ గారికి వారి ఆశయాలను నడిపించే జనసైనికులు చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్, చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎం.నాసీర్, ఐరాల మండల అధ్యక్షులు పురుషోత్తం, ఉపాధ్యక్షులు శ్రీను, దినేష్ ప్రధాన కార్యదర్శులు వాసు, తులసి, రహమతుల్లా మండల కార్యదర్శి షాజహాన్, హరి శ్రీహరి సీనియర్ నాయకులు కిషోర్, మోహన్ లకు ధన్యవాదాలు తెలియజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com