Logo
Date of Publish : 11 October 2022, 3:22 pm
Editor : Sake Naresh

వైసీపీ నేత చౌళూరు రామకృష్ణ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు

     హిందూపురం, (జనస్వరం) : హిందూపురం నియోజకవర్గంలో రెండు రోజుల క్రితం హత్య గావించబడిన వైసీపీ మాజీ సమన్వయ కర్త చౌళూరు రామకృష్ణ రెడ్డి కుటుంబాన్ని జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, హిందూపురం నియోజకవర్గం ఇంచార్జ్ ఆకుల ఉమేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రశాంతతకు మారుపేరైనా హిందూపురంలో అధికార పార్టీ నాయకుడు, హిందూపురం మాజీ సమన్వయ కర్త చౌళూరు రామకృష్ణ రెడ్డిని అత్యంత కిరతకంగా హత్యాచేయడాన్ని జనసేనపార్టీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. దీనివెనుక ఎవరి హస్తం ఉన్నా ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి దోషులను కఠినంగా శిక్షించాలని జనసేనపార్టీ తరుపున డిమాండ్ చేయడం జరిగింది. అధికార పార్టీ నాయకులకే ప్రభుత్వం రక్షణ కల్పించకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి lic రమణ, హిదూపురం రూరల్, పట్టణం, చిలమత్తూరు, లేపాక్షి మండలాల అధ్యక్షులు చక్రవర్తి, కోళ్లకుంట శేఖర్, చిన్నా ప్రవీణ్, బాలాజీ గౌడ్, జిల్లా సంయుక్త కార్యదర్శి మొద శివ, నాయకులు అగ్గి శీన, బొంచెరువు భాస్కర్, లింగరాజు, హనుమంతు, మనోహర్, మారుతీ, శేఖర్ కన్నా, లక్ష్మణ్ మూర్తి, సతీష్,రంగనాథ్, ధర్మేంద్ర, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com