Logo
Date of Publish : 24 December 2022, 3:26 pm
Editor : Sake Naresh

ఫుడ్ పాయిజన్ కు గురైన విద్యార్థులను పరామర్శించిన జనసేన నాయకులు

       అనంతపురం ( జనస్వరం ) : జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు టి.సి వరుణ్ గారి ఆదేశాల మేరకు ఫుడ్ పాయిజన్ అయిన శింగనమల కేజీబీవీ (KGBV) విద్యార్థినిలకు అనంతపురం ప్రభుత్వ హాస్పిటల్లో జిల్లా నాయకులు పరామర్శించారు.  జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి చొప్పా చంద్రశేఖర్ హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు. శింగనమల మండల కేంద్రములోని కస్తూరిభాయి స్కూలు నందు పుడ్ పాయిజన్ గురై దాదాపుగా 20 మంది విద్యార్థులు కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడుతుండడంతో వారిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించడం జరిగింది. వారిలో కొంతమందిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన విషయం తెలుసుకొని జనసేన నాయకులు పరామర్శించడం జరిగింది. అనంతపురంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు ఇబ్బంది పడుతున్న విద్యార్థులను జనసేన నాయకులు పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం జరిగింది. గడిచిన 15 రోజుల వ్యవధిలోనే రెండుసార్లు విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురి కావడం బాధాకరమని ప్రభుత్వం వెంటనే నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని జనసేనపార్టీ తరుపున డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, అవుకు విజయ్, ముప్పూరి కృష్ణ, క్రిష్ణమూర్తి, అనంతపురం నగర ఉపాధ్యక్షులు జెక్కిరెడ్డి ఆదినారాయణ, సింగనమల మండల అధ్యక్షులు తోట ఓబులేసు, నగర కార్యదర్శి హరీష్ రాయల్, జనసేన నాయకులు సిర్రప్పాగారి భాస్కర్, అజయ్, నవీన్ కుమార్ నాయకులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com