నాగర్ కర్నూలు ( జనస్వరం ) : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామంలోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ వల్ల 200 మంది విద్యార్థినులకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో 150 మంది కోలుకోక 50 మంది విద్యార్థులకు అస్వస్థత పరిస్థితి విషమంగా ఉంది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న విద్యార్థుల ప్రస్తుత పరిస్థితి చూసి డాక్టర్స్ ను అడిగి తెలుసుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించి వారిని కాపాడాల్సిందిగా డాక్టర్లను కోరిన జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు, నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంగ లక్ష్మణ్ గౌడ్. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాయకులు కొల్లాపూర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ బైరపొగు సాంబ శివుడు, అచ్చంపేట నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎస్. పి. సూర్య, నియోజకవర్గ నాయకులు పెరుమల శేఖర్, మహేష్ గౌడ్, సూర్య, వంశీ రెడ్డి, రాజు నాయక్, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com