ఆళ్ళగడ్డ ( జనస్వరం ) : ఉయ్యాలవాడ మండలం, కొండుపల్లె గ్రామానికి చెందిన క్రియాశీల జనసైనికుడు కుందవరం సతీష్ ప్రమాదంలో వెన్నుపూసకు బలమైన గాయం కారణంగా రెండు కాళ్లు చేతులు పనిచేయడం లేదు. సతీష్ ని ఆయన స్వగ్రామం కొండపల్లి గ్రామంలో ఇంటి దగ్గరికి వెళ్లి పరామర్శించిన ఆళ్ళగడ్డ జనసేన నాయకులు మైలేరి మల్లయ్య. సతీష్ కుటుంబానికి మైలేరి మల్లయ్య జనసేన పార్టీ తరపున ఆర్థిక సహాయం అందిస్తామని తెలియజేశారు. సతీష్ ను పరామర్శించిన జనసేన నాయకులు ఆకుల సురేంద్ర, వెంకటసుబ్బయ్య, రాజారాం, ఆంజనేయులు, నాగేంద్ర, గుర్రప్ప, చైతన్య, ప్రతాప్, పవన్, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com