ఆముదాలవలస ( జనస్వరం ) : ఆమదాలవలస మున్సిపాలిటీ వెంగలరావు కాలనీకి చెందినటువంటి రాంసాయి అని యువకుడు అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ చనిపోయినటువంటి రాంసాయి ఇంటికి వెళ్లి వాళ్ళ కుటుంబానికి పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. తమ కుటుంబానికి జనసేన పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసాని ఇవ్వడం జరిగింది. అనంతరం కశింవలస గ్రామంలో అనారోగ్యంతో చనిపోయినటువంటి వాకాడ సింకయ్య కుటుంబాన్ని పరామర్శించి వారి కుటుంబానికి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమలో సరుబుజ్జిలి మండల అధ్యక్షులు పైడి మురళి మోహన్, టౌన్ జనసైనికులు, బగాది ఫణికుమార్, గంగు కోటేష్, సాగర్, తవిటి నాయుడు, పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com