Logo
Date of Publish : 20 August 2023, 9:23 pm
Editor : Sake Naresh

బీసీ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన జనసేన నాయకులు

- హాజరైన జనసేనపార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, నియోజకవర్గ జనసేనపార్టీ ఇంఛార్జి ఉయ్యాల ప్రవీణ్
       సూళ్లూరుపేట, (జనస్వరం) : స్థానిక బీసీ బాలికల వసతి గృహాన్ని జనసేనపార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, నియోజకవర్గ జనసేనపార్టీ ఇంఛార్జి ఉయ్యాల ప్రవీణ్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఉయ్యాల ప్రవీణ్ మాట్లాడుతూ వెనుకబడిన కులాల పిల్లలకి నేను మేన మామని అని చెప్పుకునే జగన్ మోహన్ రెడ్డి ఈ హాస్టల్ లో మీ పిల్లల్ని ఒక్క పూట ఉంచగలరా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. అదే విధంగా గడప గడప తిరుగుతున్న ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యకి సూళ్లూరుపేట మెయిన్ బజారులో శిధిలావస్థలో ఉన్న ఈ బీసీ బాలికల వసతి గృహం కనపడలేదా..? విరిగిపోయిన తలుపులు, కిటికీలు ఎప్పుడు పడిపోతుందో తెలియని భవనం పైకప్పు, తలుపులు లేని బాత్రూంలు, ఆడబిడ్డలకు లేని రక్షణ, 111 మంది బీ.సీ బాలికలకు ఉన్నది 2 గదులు మాత్రమే. పొద్దున లేచినప్పటినుంచి పడుకునే వరకు అన్నీ ఆ రెండు గదులలోనే అని ఆవేదన వ్యక్తం చేశారు. మాట్లాడితే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసే మహిళా మంత్రులు, వైసిపి నాయకురాలు ఇవి చూసి వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బాలికలకు అన్నివిధాలుగా న్యాయం జరిగే వరకు, జనసేనపార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రమణ, ఉపాధ్యక్షుడు శ్రీహరికోట జగదీష్, నియోజకవర్గ నాయకులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com