దెందులూరు ( జనస్వరం ) : జనసేన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి డా. వడ్లపట్ల సాయి శరత్ మూగ, బధిర చిన్నారులతో పెదవేగి మండలంలో క్రిస్మస్ సంబరాలు జరుపుకున్నారు. ఆయన మాట్లాడుతూ పాప కార్యాలని గ్రహించి పశ్చాత్తాపం చెందడం క్రైస్తవ విశ్వాసానికి కేంద్ర బిందువు అని, అటువంటి పశ్చాత్తాపం అవసరం లేని పాపం ఎరుగుని మూగ, బధిర చిన్నారులతో కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నానన్నారు. అనంతరం పిల్లలకి ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com