అనకాపల్లి, మార్చి31 (జనస్వరం) : అనకాపల్లి పార్లమెంట్ NDA అభ్యర్థి, రాజ్యసభ సభ్యులు C M రమేష్ ని పెందుర్తి నియోజకవర్గం 88 వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు వబ్బిన జనార్దన్ శ్రీకాంత్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. తన వార్డులో అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 గ్రామాల యొక్క భౌగోళిక, అభివృద్ధి, మరియు సమస్యల పరిస్థితిపై వివరిస్తూ మీలాంటి చిత్తశుద్ధి ఉన్న నాయకులు మా అనకాపల్లి పార్లమెంటుకు రావడానికి స్వాగతిస్తూ మిమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి కొని మా యొక్క సమస్యలను తీర్చుకుంటామని చర్చించడం జరిగింది. ఎంపీ అభ్యర్థి రమేష్ బదులిస్తూ ప్రతిరోజు నా దగ్గరికి మీలాంటివారు వస్తూ సమస్యలు తీసుకుని వస్తున్నారు అని స్థానిక నాయకుల లోపం వల్ల ఈ యొక్క అనకాపల్లి వెనుకబాటుతనాన్నికి గురైందని తప్పకుండా మన అందరి సహకారంతో ఈ అనకాపల్లి అభివృద్ధి చేసుకుందామని మీలాంటి యువత ఈ యొక్క దేశానికి చాలా అవసరం మోడీ చెప్తూ ఉంటారని, అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలను, ఎంపీ ను గెలిపించుకొని రాష్ట్రానికి డబ్బులు ఇంజిన్ సర్కార్ తీసుకొని వచ్చి అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర సెక్రెటరీ కేతనేని సురేంద్రమోహన్, పెందుర్తి నియోజకవర్గం బిజెపి కన్వీనర్ గొర్ల రామానాయుడు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com