
– ఎల్. కోట గ్రామంలో పర్యటించిన జనసైనికులు
– షణ్ముఖ వ్యూహంతో సమగ్రాభివృద్ధి
– పార్టీ నాయకులు వబ్బిన సత్యనారాయణ
శృంగవరపుకోట, (జనస్వరం) : జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన కల్యాణ్ ఆలోచనలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో భాగంలో ఆదివారం జనసేన నాయకులు ఎల్.కోటలో జనం కోసం జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ నాయకులు వబ్బిన సత్యనారాయణ ఆధ్వర్యంలో జనసైనికులు గ్రామంలో పర్యటించారు. ప్రతి ఇంటికీ వెళ్తూ పార్టీ సిద్ధాంతాలు వివరించారు. జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహం గురించి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వబ్బిన సత్యనారాయణ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ధరలు విపరీతంగా పెరిగి, ఆదాయం లేని పరిస్థితుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈతరుణంలో నిస్వార్థపరుడైన పవన్ కల్యాణ్ నాయకత్వం రాష్ట్రానికి అవసరమని స్పష్టం చేశారు. జనసేన అధికారంలోకి వస్తే అమలు చేయబోయే షణ్ముఖ వ్యూహంతో రాష్ట్ర భవిష్యత్ మారిపోనుందని పేర్కొన్నారు.