Search
Close this search box.
Search
Close this search box.

పనపాకంలో వైఎస్సార్సీపీ నాయకునికి అండగా జనసేన నాయకులు

వైఎస్సార్సీపీ

         చంద్రగిరి ( జనస్వరం ) : చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారి ఆదేశానుసారం, తిరుపతి-చిత్తూర్ నేషనల్ హైవే లోని రోడ్డు విస్తరణలో భాగంగా చంద్రగిరి నియోజకవర్గంలోని చంద్రగిరి మండలం, పనపాకం పంచాయతీలోని ఇరిగిసెట్టీ వారిపల్లిలో స్థానిక YSRCP నాయకులు హేమాద్రి మరియు 20 మంది స్థానికులకు NHAI వారి వల్ల జగురుగుతున్న అన్యాయాలను మరియు వారికి నష్ట పరిహారం అందకుండా దౌర్జన్యంగా రోడ్డు పనులు ప్రారంభిస్తున్న తీరుని జనసేన జిల్లా నాయకులు దేవర మనోహర్ గారికి వివరించారు. ప్రజల కష్టాలను వారి బాధను విన్న జనసేన నాయకులు దేవర మనోహర వెంటనే స్పందించి స్థానిక ప్రజలను కలిసి వివరాలు సేకరించారు. దాదాపు 20 మంది బాధితులు ఉంటే కేవలం ముగ్గురికి మాత్రమే బలవంతంగా నష్టపరిహారం ఇచ్చి, వారికి పునరావాసం కల్పించలేదు. మిగిలిన 17 మంది స్థానికులకు మరియు రైతులకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా వారి ఇళ్లను అక్రమంగా కూల్చుతున్నారు. స్థానికులు అందరూ హైకోర్ట్ ను ఆశ్రయించి కేసులు పెట్టారు, ఆ కేసులు కూడా పెండింగ్ లో ఉన్నా వాటిని అధికారులు పట్టించుకోకుండా పనులు చేస్తున్నారు. బాధితుల పక్షాన నిలబడిన జనసేన నాయకులు దేవర మనోహర, రాష్ట్ర కార్యదర్శి అకేపాటి సుభాషిణి స్థానిక ప్రజలతో కలిసి నేషనల్ హైవేలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నిరసన కార్యక్రమంలో దేవర మనోహర గారు మీడియాతో మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వ అధికారులు రీ’సర్వే చేసి బాధితులకు కేంద్ర ప్రభుత్వం 2014 లోని భూసేకరణ చట్టాన్ని ఆధారంగా చేసుకొని ప్రస్తుత మార్కెట్ కి 4 రెట్లు నష్ట పరిహారాన్ని ఇచ్చి వారికి పునరావాసం కల్పించాలి అని డిమాండ్ చేశారు. వారికి నష్టపరిహారం ఇచ్చిన తరువాతే పనులు ప్రారంభించాలని, 24 గంటల లోపు ప్రభుత్వ అధికారులు స్పందించాలని లేని పక్షంలో రేపు తిరుపతి కలెక్టర్ గారిని భాదితులతో కలిసి సమస్య వివరించి పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం మండల అధ్యక్షులు సంజీవి హరి, ఉపాధ్యక్షులు ఆశ, కిరణ్, జనసేన నాయకులు వాకా మురళి, రాజేష్, తరుణ్, ముత్యాలు మరియు జనసైనికులు మరియు వీరమహిలలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం
కందుకూరు
కందుకూరు గ్రామంలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసిన సిబ్బంది
కందుకూరు
కందుకూరు గ్రామ పంచాయితీలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way