ఆత్మకూరు ( జనస్వరం ) : అనంతసాగరం మండలం, పడమటి కంభంపాడు ఇసుక రీచ్ లో అక్రమంగా తరలిస్తున్న ఇసుకను జనసైనికులతో కలిసి అడ్డుకున్న నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ దొంగ బిల్లులతో పడమటి కంబంపాడు ఇసుక రీచ్ నుండి ప్రతిరోజు వందల సంఖ్యలో లారీలతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు.ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి రాగానే కొత్త ఇసుక విధానం అంటూ అప్పటివరకు ఉన్న ఉచిత ఇసుకపాల్సిని నిలిపివేశారు. రాష్ట్రం లోని మొత్తం ఇసుక రీచ్ లను ఒకే ఒక్క కంపెనీకి అప్పగిస్తూ జగన్ సర్కారు తెచ్చిన ఇసుక విధానం మే 13వ తేదీతో ముగిసింది. ఆ తరువాత ప్రభుత్వం కొత్తగా ఎవరికి కాంట్రాక్టు ఇవ్వలేదు. టెండర్లు పిలవలేదు. గతంలో లాగా ఉచిత ఇసుక పాలసీ కూడా అమలులో లేదు. మరి ఇసుకను ఎవరు తవ్వుకు వెళ్తున్నారు. ఆదాయం ఎవరికి పోతుంది. ఈ దోపిడీని వెంటనే అరికట్టాలని ఆత్మకూరు నియోజకవర్గం జనసేన పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఉదయగిరి రవి, దాడి బాను కిరణ్ మావిళ్ళ ఆనంద్ తదితరులతో కలిసి జనసైనికులు పాల్గొన్నారు.