లింగపాలెం ( జనస్వరం ) : మండలం ధర్మాజిగూడెం గ్రామంలో జనసైనికుడు కలకోటి నాగ దుర్గా పేరాచారి అమ్మగారికి ఇటీవల హార్ట్ ఆపరేషన్ జరిగిన నేపథ్యంలో వారి కుటుంబాన్ని పరామర్శించిన లింగపాలెం మండలం జనసేన నాయకులు. మండల జనసేన పార్టీ తరపున 17000/- రూపాయలను చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జ్ మేకా ఈశ్వరయ్య, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి తూము విజయ్ కుమార్, కామవరపుకోట మండల అధ్యక్షుడు షేక్ వలీ గారి చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో లింగపాలెం మండల అధ్యక్షుడు పంది మహేష్ బాబు, మాదాసు కృష్ణ, మండల ఉపాధ్యక్షులు తాళం మల్లేశ్వరరావు, చల్లా నాగబాబు, ప్రధాన కార్యదర్శులు పూజారి సురేష్, మోదుగు అంజిబాబు, కార్యదర్శులు పుంజాల నరేంద్ర, పొదిల మహేష్, నాయకులు షేక్ షఫీ, బందెల సుధాకర్ పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com