Logo
Date of Publish : 25 September 2023, 11:54 pm
Editor : Sake Naresh

సాక్షి దినపత్రికను మంటగలిపిన జనసేన నాయకులు

       అనంతపురం ( జనస్వరం ) : పత్రికా విలువలు పాటించకుండా జనసేన నాయకులు నాగబాబు గారి మాటలను వక్రీకరిస్తూ తప్పుడు కథనాలు రాస్తే చూస్తూ ఊరుకోమని అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు జయరాం రెడ్డి అన్నారు.  సాక్షి దినపత్రికలో... టిడిపి నాయకులు మన కింద పని చేయాలి! జనసేన టిడిపి శ్రేణుల మధ్యన పొసగని పొత్తు!! పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ అభిమానుల మధ్య సయోధ్య కుదరలేదు? మాకు సీఎం పదవి అవసరం లేదు? ఇలాంటి తప్పుడు రాతలు రాసి జనసేన టిడిపి శ్రేణులు మధ్యన అయోమయాన్ని సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్న వైసీపీ శ్రేణులకు ఇదే మా హెచ్చరిక అన్నారు. జనసేన టిడిపి పొత్తుని రెండు పార్టీల కార్యకర్తలు, అభిమానులు, నాయకులందరూ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి మరియు బాలకృష్ణ అభిమానులు అందరం కలిసి కట్టుగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో జనసేన-టిడిపి ప్రభుత్వాన్ని స్థాపించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నామని అన్నారు. జనసేన టిడిపి పొత్తుని ఓర్చుకోలేక అక్కస్సుతో వైసిపి వారు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, మీకు చాతనైతే మీరు అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు మీరు చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజేసి వచ్చే ఎన్నికల్లో గెలవండి? జనసేన-టిడిపి పొత్తు గురించి ఓర్చుకోలేక అక్కసు వెళ్లగక్కితే మీకు ఉపయోగం లేదు అని తెలుసుకోండని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com