సర్వేపల్లి ( జనస్వరం ) : వెంకటాచలం మండలంలోని సర్వేపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న కొత్తగుంట స్మశానంలో గ్రావెల్ తోలించాలన్న సమస్యపై సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో వినతిపత్రం అందించారు. వెంకటాచలంలోని మండల రెవెన్యూ కార్యాలయంలో తహసిల్దార్ కృష్ణ గారికి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు వినతిపత్రం అందించారు. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ సర్వేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఐదు కులాల వారు వాడుకునే కొత్తగుంట స్మశానం వర్షాకాలం వర్షపు నీటితో నిండిపోతే శవాన్ని తీసుకువెళ్లి పుడ్చాడానికి ఎంతో ఇబ్బంది ఉంటుంది. ఈ విషయాన్ని తహసిల్దార్ గారికి వెన్నవిచ్చుకున్న ఆయనకు ఇది రెండవసారి కలిసి మా సమస్యను తెలియజేయడం జరిగింది. అయితే ఈరోజు సానుకూలంగా స్పందించి వెంటనే వీఆర్వో గారిని పిలిపించి మా సమస్యపై స్పందించి అక్కడికి వెళ్లి స్థలాన్ని పరిశీలించి వెంటనే నివేదిక ఇవ్వాలని చెప్పి ఎమ్మార్వో కృష్ణ గారి ఆదేశించడం జరిగింది. వెంటనే వీఆర్వో గారు కూడా వచ్చి ఆ స్థలాన్ని పరిశీలించారు. నివేదికనే మండల రెవెన్యూ అధికారి గారికి అందజేస్తాము త్వరితగతిన మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంతమంది పాలకులు సర్వేపల్లి నియోజకవర్గం పరిపాలించి వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకుంటున్నారని మా నియోజకవర్గంలో ఉన్న సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించే పరిస్థితిలేవు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ బలంగా నిలబడుతుంది అదేవిధంగా 2024లో జనసేన పార్టీ విజయకేతనం ఎగరవేస్తాం మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటాం అని చెప్పి తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పినిశెట్టి మల్లికార్జున్, తెనాలి రాజేంద్ర, బింకెన కోటేశ్వరరావు, శ్రీహరి, రహీం, అక్బర్, చిన్న, తదితరులు పాల్గొన్నారు.