విజయనగరం, (జనస్వరం) : టీిం పిడికిలి విజయనగరం కో ఆర్డినేటర్, జనసేన పార్టీ సీనియర్ నాయకుడు రవితేజ ఆధ్వర్యంలో శనివారం ఉదయం స్థానిక బాలాజీ జంక్షన్ వద్ద అంబేత్కర్ సామాజిక భవనంలో పార్టీ సీనియర్ నాయకుడు ఆదాడ మోహనరావు, పార్టీ సీనియర్ నాయకుడు, విజయనగరం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) చేతులమీదుగా టీమ్ పిడికిలి పత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు ఆదాడ మోహనరావు,బాలు మాట్లాడుతూ జనసైనుకుల్లోను, నాయకుల్లోను సరికొత్త ఉత్సాహాన్ని నింపడానికి, పార్టీ అభివృద్ధికోసం వెనుకుండి, పేరుకోసం కాకుండా జనసేన సిద్ధాంతాలకోసం, పవన్ కళ్యాణ్ ఆశాయాలకోసం టీమ్ పిడికిలి నడుం బిగించడం అభినందనీయమని ఇంతవరకు టీమ్ పిడికిలి చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఏర్నాగుల చక్రవర్తి, కోయ్యాన లక్ష్మణ్ యాదవ్, సలీమ్, కందివలస సురేష్, రఘు,రాజు, నాయుడు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com