Logo
Date of Publish : 08 October 2023, 10:42 pm
Editor : Sake Naresh

మానసికంగా కృంగిపోయిన అమ్మాయికి చికిత్స కొరకు ఆర్థిక సాయం అందజేసిన జనసేన నాయకులు

     పామిడి ( జనస్వరం ) : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవ స్ఫూర్తితో పామిడి పట్టణానికి చెందిన షేక్ సోనీ తల్లితండ్రులను కోల్పోయి మానసికంగా కృంగిపోయి తీవ్ర అనారోగ్యానికి గురి అయ్యింది. నేడు ఆమె చికిత్స నిమిత్తము సుమారు లక్ష రూపాయలు అవుతుందన్న విషయాన్ని తెలుసుకున్న పామిడి మండల జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు ఆ అమ్మాయి పరిస్థితిని చూసి చలించిపోయారు. పవన్ కళ్యాణ్ ఏదైతే ఎప్పుడూ అభిమానులకు చెపుతుంటారో కష్టాల్లో ఉన్నవారికి మన వంతు భరోసాగా నిలబడుదాం, ఆపదలో ఉన్నవారికి మన వంతు ఆపన్న హస్తాన్ని అందిద్దాం అన్న నాయకుడి మాటలను స్ఫూర్తిగా తీసుకొని తమ వంతు బాధ్యతగా అందరూ డబ్బును జమ చేసి సుమారు11,710/- రూపాయలు ఆ చిట్టి తల్లి చేతికే ఇవ్వడం జరిగింది. ఆ అమ్మాయి జనసేన పార్టీ నాయకులను చూసి పవన్ కళ్యాణ్ బొమ్మ ఉన్న కండువా నాకు కావాలి నేను వేసుకుంటా అంటూ మా మెడలోని కండువాని తీసుకొని తను తన మెడలో వేసుకొని మానసికంగా తను సరిగా లేకున్నా పవన్ కళ్యాణ్ బొమ్మను చూస్తూ ఆనందపడిన వైనన్ని చూస్తే మాకెంతో సంతోషం అనిపించిందని అన్నారు. పవన్ కళ్యాణ్ అంటే ఆ అమ్మాయికి అమితమైన ఇష్టం అన్నది అర్థమైందన్నారు. ఆ అమ్మాయి చికిత్స చేయించుకొని త్వరగా పూర్తి ఆయురారోగ్యాలతో అందరి అమ్మాయిల్లాగా తన జీవితాన్ని సుఖ సంతోషాలతో గడపాలని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com