Logo
Date of Publish : 07 December 2022, 8:09 am
Editor : Sake Naresh

కొత్తవలస జంక్షన్ లో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన జనసేన నాయకులు

        విజయనగరం ( జనస్వరం ) : డాక్టర్అం. బేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా కొత్తవలస జంక్షన్ లో గల అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన కొత్తవలస మండల జనసేన నాయకులు. ఈ సందర్భంగా పాల్గొన్న కొత్తవలస మండల జనసేనపార్టీ అధ్యక్షుడు నక్కరాజు సతీష్ మాట్లాడుతూ, అంబేద్కర్ కాన్సిరాం మరియు మహనీయుల స్ఫూర్తితో వచ్చిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పేద, బడుగు, బలహీన వర్గాల నిరుపేద ప్రజలకు అండగా ఉండాలని మా జనసేన నాయకులకు పిలుపునిచ్చారని తెలిపారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులతో రిజర్వేషన్లతో రాజకీయ మరియు అధికార పదవులు స్వీకరించిన వ్యక్తులు ఈ రోజు నిరుపేద ప్రజలకు తూట్లు పొడుస్తున్నారనే విషయం అందరికి తెలిసిందే. అలాగే కొత్తవలస ప్రభుత్వ కళాశాలకు దగ్గరలో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం చేయి విరిగి చాలా రోజులు అయిందని ఒక సామాన్యుడు చెప్పిన విషయం తెలిసికొని చూసి చలించానని, తక్షణమే జనసేన నాయకులందరం కలిసి ఆ విగ్రహానికి మరమ్మతులు చేసి అతని అంబేద్కర్ గారి రుణం తీర్చుకుంటామని మీడియా ముఖంగా తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కొత్తవలస మండల జనసేన నాయకులు జిల్లా ప్రచార కమిటీ సభ్యుడుH మల్లువలస శ్రీను, మల్లరాజు, గాలి అప్పారావు, పిల్లా రామ దుర్గ, గురజాడ వెంకటేష్, తురుబిల్లి విజయ్, జామి బలరాజు, బోణి రామ్ గణేష్, కంటకాపల్లి రాజేష్, తదితరులు పాల్గొన్నారు


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com