ఆళ్లగడ్డ ( జనస్వరం ) : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా చంద్రబాబు నాయుడు గారిని నంద్యాలలో అరెస్టు చేసిన స్థలంలోనే మాజీ మంత్రి భూమా అఖిలప్రియ గారు నిరసన దీక్షను పోలీసులు భగ్నం చేయడాన్ని తీవ్రంగా ఖండించిన ఆళ్ళగడ్డ జనసేన నాయకులు మైలేరి మల్లయ్య. భూమా అఖిలప్రియ గారిని మహిళా అని కూడా చూడకుండా అర్ధరాత్రి రెండు గంటలకు అరెస్టు చేసి ఆళ్ళగడ్డ వారి ఇంటి దగ్గర వదిలి పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగానికిలోబడి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాంతియుతంగా నిరసన దీక్ష చేసే హక్కు భారతదేశంలో ప్రతి ఒక్క పౌరుడికి ఉందని రాజ్యాంగానికి అనుగుణంగానే భూమా అఖిలప్రియ గారు నిరసన దీక్ష చేపట్టారని, రాష్ట్రంలో వైయస్సార్సీపి ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకులు ప్రజల తరఫున చేపడుతున్నటువంటి కార్యక్రమాలను అడ్డుకుంటూ లేని సెక్షన్ 30, 144 సెక్షన్ల అమలు చేస్తూ అధికార దుర్వినియోగంతో పోలీసు వ్యవస్థతో ప్రజల తరఫున పోరాడుతున్న వారి గొంతుని నొక్కుతున్నారని తెలియజేశారు. రాష్ట్రంలో ఆరు నెలల తరువాత జనసేన, టిడిపి, బిజెపి కూటమితో కూడిన ప్రజా ప్రభుత్వం రాబోతుందని, ప్రభుత్వ అధికారులు, పోలీసులు గుర్తుపెట్టుకోవాలని తెలియజేశారు. ఏదైతే వైఎస్ఆర్సిపి నాయకులు కక్షపూరిత చర్యలు చేపడుతున్నారో 2024 తర్వాత ప్రతి చర్యలు కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు పసుల నరేంద్ర యాదవ్, వేముల కోటి, రాచంశెట్టి వెంకటసుబ్బయ్య, రమణచారి, దేవా ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com