చంద్రగిరి ( జనస్వరం ) : రాష్ట్రంలో ఎక్కడా లేనంతగా చంద్రగిరి నియోజకవర్గంలో అత్యధికంగా సుమారు ఎనభై వేలు పైచిలుకు దొంగ ఓట్ల నమోదు అయ్యాయని చంద్రగిరి జనసేన ఇన్చార్జ్ మనోహర్ ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దొంగ ఓట్ల ప్రధాన ధ్యేయంగా ఒక్కొక పోలింగ్ బూత్ కి 200 ఓట్లు లెక్కన గ్రామ సచివాల సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, వాలంటరీ వ్యవస్థన ఉపయోగించుకుని ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడుస్తున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇందుకు సంబంధించిన మొత్తం ప్రక్రియను కెవిఎస్ (KVS Infra) అనే సంస్థ పరిధిలోని ఉద్యోగుల, పేద నిరుద్యోగ యువతని గాలం వేసి ఫార్మ్ 6 లు అత్యధికంగా ఓటర్ యాప్ ద్వారా చేసి ప్రభుత్వ అధికారుల పనికి మరియు ఓటర్ల డేటాను గందరగోళం పట్టిస్తున్నారు అని ఆరోపించారు. 395 పోలింగ్ బూత్ లలో ఇదే ప్రక్రియతో దొంగ ఓట్లతోనే రానున్న ఎన్నికల్లో గెలవాలనే ధ్యేయంతో, అభివృద్ధిని పక్కకు నెట్టి దోచుకోవడమే కుటుంబ అజెండాగా పెట్టుకున్నారు. యువతి యువకుల నూతన ఓట్ల నమోదును పక్కదోవ పట్టిస్తూ ఉన్న ఒట్లనుసైతం తొలగించడమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్న చంద్రగిరి ఎమ్మేల్యే ని రానున్న ఎన్నికల్లో ఘోరంగా ఓడించి జనసేన – టిడిపి ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని ఆకాక్షించారు. అలాగే పలుమార్లు ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఈ విషయంపై సరైన స్పందన రాకపోవడంతో ఆధారాలతోసహా, కేంద్ర మరియు రాష్ట్ర ఎన్నికల సంఘాలకి, రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి గవర్నర్ కి, కేంద్ర శాఖలైన హోమ్, రెవెన్యూ అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గ EROకి, ఎక్కడైతే దొంగ ఓట్లు నమోదయ్యాయి వాటిని సాంకేతిక సైబర్ క్రైమ్ సంస్థ ద్వారా దర్యాప్తు చేయాలని అలాగే వారిని శిక్షించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి, రామచంద్రాపురం మండల అధ్యక్షులు సంజీవి హరి, అర్బన్ అధ్యక్షులు యువ కిషోర్, తిరుపతి రూరల్ నాయకులు వాకా మురళి, నియోజక వర్గనాయకులు యువరాజ్, రమేష్, కిరణ్, నూనె దిలీప్, వీర మహిళలు లావణ్య, చందన మరియు తదితరులు పాల్గొన్నారు.