Logo
Date of Publish : 14 October 2022, 2:24 am
Editor : Sake Naresh

జనసేన నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డికి బ్రహ్మరథం పట్టిన చిన్నబజారు వ్యాపారస్తులు

● ఘనంగా జరిగిన 150వ రోజు పవనన్న ప్రజాబాట
●ములుముడి బస్టాండ్ నుండి చిన్నబజారు మీదుగా పెద్దబజారు వరకు ప్రధాన వీధిలో జనసైనికుల ర్యాలీ
●అడుగడుగునా కేతంరెడ్డికి పూలమాలలు, శాలువాలు కప్పుతూ స్వాగతం పలికిన వ్యాపారులు
     నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 150వ రోజున ములుముడి బస్టాండ్ నుండి పెద్దబజారు వరకు ప్రధాన వీధిలో ఘనంగా జరిగింది. వందలాది మంది కార్యకర్తలు తీన్మార్ డప్పులు, బాణాసంచా మధ్య ఉత్సాహంతో కేతంరెడ్డి వినోద్ రెడ్డికి పూలమాలలు, శాలువాలు కప్పి సత్కరించారు. కార్యక్రమం సాగుతున్నంత సేపు పలు దుకాణాల నుండి పలువురు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బయటకి వచ్చి తమ మద్దతు తెల్పుతూ కేతంరెడ్డిని సత్కరిస్తూ నెల్లూరు సిటీకి కాబోయే ఎమ్మెల్యేగా గెలిపిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేనపార్టీని అపూర్వంగా ఆదరిస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. 150 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనే దృఢ సంకల్పంతో ప్రారంభమైన పవనన్న ప్రజాబాట నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతూ ఇప్పటికి నియోజకవర్గంలో 40వేల పైగా ఇళ్ళకు చేరువ కావడం ఆనందంగా ఉందన్నారు. చిన్నబజారు, పెద్దబజారు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా చూపిన ఆప్యాయత నూతన ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా నెల్లూరు సిటీలో గెలిచేది తామేనని, ప్రతిఒక్కరికీ అండగా నిలుస్తామని అన్నారు. ప్రజలందరి ఆశీస్సులతో నియోజకవర్గంలో ఏ ఒక్క ఇంటిని కూడా విస్మరించకుండా 365 రోజులు దాటినా కూడా ఆగకుండా పవనన్న ప్రజాబాట కొనసాగుతుందని కేతంరెడ్డి వినోద్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు పావుజేన్ని చంద్ర శేఖర్ రెడ్డి, కాకు మురళి రెడ్డి, ఉడాలి సూర్యనారాయణ, మూడూరి కనకేశ్వర్ రావు, కార్తిక్, శ్రీకాంత్, మన్నెపల్లి వినయ్ కుమార్, వరప్రసాద్, సుజన్ సింగ్, యువరాజ్, హేమంత్ రాయల్, కుక్క ప్రభాకర్, జాఫర్, జీవన్, వెంకటేశ్వర్లు, చిన్న, దిలీప్, బలరాం రాజా, వీరమహిళలు శిరీష రెడ్డి, సృజన, సునంద, ఝాన్సీ, మేరీ, ప్రీతి, అనూష, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com