పలమనేరు ( జనస్వరం ) : పెద్ద పంజాణీ మండలంలోని మీదేపల్లిలో పవన్ కళ్యాణ్ గారి ఆశయలు నచ్చి చిత్తూరు జిల్లా కార్యదర్శి పూల చైతన్య మోహన్ గారి ఆధ్వర్యంలో జనసేనపార్టీలోకి చేరారు. పెద్ద పంజాణీ మండల నాయకులు సవరం పవన్ కుమార్, రాయల్ శివ కుమార్, అమరనాథ్, సురేంద్ర సమక్షంలో 35 మంది యువకులు జనసేన పార్టీలో చేరడం జరిగింది. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామని యువకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్ర, కిరణ్, చంద్రశేఖర్, హేమ కుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com