
పాలకొండ, (జనస్వరం) : పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం వీరఘట్టం మండలంలో నాగావళి ఎడమ కాలువ అనుబంధ ఆప్టేక్ చానల్ కాలువ గట్టులు కోతకు గురి అవుతున్న సంబంధించిన నీటి పారుదల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు అని జనసేనపార్టీ నాయకులు అన్నారు. ఈ రోజు నాగావళి ఎడమ కాలువ అనుబంధ కాలువలను మత్స పుండరీకం, బి.పి.నాయుడు, జనసేన జాని, కర్నేన సాయి పవన్ లు కంబర, కంబర వలస, నడుకురు గ్రామంలోని సాగునీటి కాలువలను వర్షంలో సైతం పర్యటించి కాలువలను పరిశీలించారు. కొంతమంది రైతుల కలిసి కాలువాల పరిస్థితి గురించి అడగగా గత పది ఏళ్లుగా ఈ కాలువల్లోని మొక్కలు, పూడికతో నిండి ఉన్నాయని, ఉపాధి హామీ పథకంలో బాగుచేయమని పలుమార్లు అధికారులు దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేదని రైతులు జనసేనపార్టీ నాయకులతో చెప్పారు. ఈ సందర్భంగా మత్స పుండరీకం మాట్లాడుతూ నాగావళి ఎడమ కాలువల అనుబంధ కాలువలకు నీటి సంఘాలు ఉన్నాయి వాటి నిధులు ఏమైనట్టు అని ప్రశ్నించారు. నీటిపారుదల శాఖ అధికారులు నిధురపోతున్నారా ? ప్రతి కాలువకి లష్కర్ లు వుండేవారు, కాలువాలను పరిశీలించి వాటిని బాగుచేసేవారు. ఈ రోజు నీటి పారుదల శాఖలో లాస్కర్ లు లేని పరిస్థితి ఏర్పడింది. సంబంధించిన అధికారులు తక్షణమే ఆప్టేక్ చానల్ కాలువలను బాగుచేయాలని జనసేనపార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కలిపిల్లి సింహ చలం, వాన మహేష్, ప్రణీత్, మత్స. కృష్ణరావు, వాన మహేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.