• బోట్ యార్డుని వైసిపి కార్యాలయానికి ఉపయోగిస్తే చూస్తూ ఊరుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరించిన మంగళగిరి జనసేన నాయకులు
మంగళగిరి, (జనస్వరం) : జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్, మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జీ చిల్లపల్లి శ్రీనివాసరావు, మంగళగిరి నియోజకవర్గం నాయకులు తాడేపల్లి సీతానగరం నిరుపయోగంగా ఉన్న బోట్ యార్డుని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ PWD బోట్ యార్డ్ లో ఎన్నో విలువైన పరికరాలు నిరుపయోగంగా పడి ఉన్నాయని, బోట్ యార్డు స్థలం దాదాపు 10 ఎకరాలు ఉందని, ఈ స్థలాన్ని ఐఐటీ కాలేజి లేదా హస్పిటల్ నిర్మించేలా, చిన్నజీయర్ స్వామి ఆశ్రమం సమీపంలో ఉన్న ఈ స్థలాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక ఉద్యానవనం గానో, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ స్థలాన్ని రూపుదిద్దాలని ప్రస్తుత ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవాలని, బోటుయార్డు స్థలము పరిశీలిస్తుండగా స్థానికులు మాతో మాట్లాడుతూ ప్రభుత్వ స్థలంలో వైసీపీ కార్యాలయంగా మారుస్తారని ఈ మధ్యన కలెక్టర్ కూడా వచ్చి పరిశీలించారని మాకు చెప్పడం జరిగింది అని అన్నారు. వైసిపి కార్యాలయ నిర్మాణానికి బోట్ యార్డు స్థలాన్ని ఉపయేగిస్తే సమస్యను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ద్రుష్టికి తీసుకువెళ్లి కచ్చితంగా అడ్డుకుని తీరతామని హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. జనసేనపార్టీ అధికారంలోకి రాగానే మంగళగిరి నియోజకవర్గంలో నిరపయోగంగా పడియున్న బోట్ యార్డును అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ MTMC అధ్యక్షులు మునగ పాటి వెంకట మారుతీరావు, రాష్ట్ర ఐటీ విభాగం కోఆర్డినేటర్ చవ్వాకుల కోటేష్ బాబు, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు, తాడేపల్లి మండల ఉపాధ్యక్షులు తంబి,సీనియర్ నాయకులు నారాయణ, తాడేపల్లి మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ నిరంజన్, మంగళగిరి పట్టణ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జొన్నాదుల పవన్ కుమార్, చిల్లపల్లి యూత్ సభ్యులు మేకల చంద్రశేఖర్, పెనుమాక గ్రామ నాయకులు, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.