ఆముదాలవలస ( జనస్వరం ) : పొందూరు మండలం, కింతలి పంచాయతి, ఖాజీపేట గ్రామంలో ఖాజీపేట గ్రామ జనసేన నాయకులు ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్య్రమంలో ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇంఛార్జి పేడాడ రామ్మోహనరావు గారు పాల్గొన్నారు. ఖాజపేట గ్రామ జనసేన నాయకుడు పల్ల పవన్ కుమార్ ఆధ్వర్యంలో జనసేన నాయకులు మరియు భారీగా వచ్చిన జన సైనికుల మధ్య ఆయన జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం గ్రామ జనసైనికులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క జగన్ రెడ్డి వ్యవస్థ తప్ప అన్ని వ్యవస్థలు భారీగా దెబ్బతిన్నాయని, కేంద్రీయ అవినీతితో మొత్తం రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి లో ఉంది అని ఆవేదన వ్యక్తం చేసారు. ఏ ఒక్క మినిస్టర్ కి ఆయా శాఖ గురించి పరిజ్ఞానం లేకపోవడం మన కర్మ అని అన్నారు. ఈరోజు మన రాష్ట్రంలో పంచాయితీ రాజ్ వ్యవస్థ అసలు ఉందా? అని ప్రశ్నించారు. పంచాయతీ నిధులు ను పంచాయితీ కోసం కాకుండా తన స్వంత నిర్ణయాలు కోసం ఈ సీఎం లాక్కుంటున్నారు అని సర్పంచ్ లు రోడ్లు ధర్నా చేయడం మహాత్మా గాంధీ కన్న గ్రామ స్వరాజ్ కి తూట్లు పొడవటమే అని ఆయన మండిపడ్డారు. జనసేన అధికారంలోకి వస్తే పూర్తి అధికారం సర్పంచ్ లకే ఇస్తామని ఆయన ఈ సభాముఖంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మండల అధ్యక్షులు యలకల రమణ, పైడి మురళీ మోహన్, నియోజక వర్గ నాయకులు సిరలాపు గణేశ్, కొంచాడ సూర్య, యతిరాజుల గోపాల కృష్ణ, శ్రీను మాస్టర్, మండల నాయకులు పొన్నాడ బాల కృష్ణ, కోరాడ రాజు, రామ్ లక్ష్మణ్, వంజ్రాపు బాలకృష్ణ, సురేష్, జారజాపు గణేశ్, గోవింద, రాజు, సంతోష్, రమేష్, రాము మరియు జన సైనికులు పాల్గోన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com