Logo
Date of Publish : 23 December 2023, 8:56 pm
Editor : Sake Naresh

జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతులను సన్మానించిన జనసేన నాయకులు

   రాజంపేట ( జనస్వరం ) :  జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా పాడి రైతులతో జనసేనపార్టీ నాయకుడు రామ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రామయ్య అనే రైతుకు సన్మానం కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగిమల్ల రంగారెడ్డి పాల్గొని రైతులందరికీ వారిరువురు జాతీయ రైతు దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలకపక్ష ప్రజాప్రతినిధులు రైతు అనే పదం పేరుతో మాత్రం రైతు రాజ్యానికి వెన్నుముక లాంటి అసత్య మాటలు నమ్మపలుకుతున్నారు. రైతులు ఏ విధంగా నష్టపోతున్నారు అని ఏమాత్రం ఆలోచించకుండా ఒక వైపున కరువుతో మరొకవైపున వరదతో నష్టపోయిన రైతులను కనీసం వారి పట్ల కనికరించకుండా ఉన్నారన్నారు. కరువుతో నష్టపోయిన రైతులను సర్వే చేసి, వరదతో ఒకవైపున నష్టపోయిన రైతులు పైన పూర్తి సర్వే చేయించి రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ మంజూరు చేయాలన్నారు. తీసుకున్న రుణం మాఫీ చేసి వెంటనే మంజూరు చేయాలని, రైతులకు సంబంధించిన ఎరువులు, మందులు కానీ వారికి న్యాయం జరిగే విత్తనాలు మంజూరు చేయాలని కోరారు. లేనియెడల రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడే అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు. రానున్న ఎన్నికలలో జనసేన, తెలుగుదేశం పార్టీలకు రైతులందరూ మద్దతు ఇవ్వాలని రాబోయే ఉమ్మడి ప్రభుత్వం ద్వారా క్షేత్ర స్థాయిలో రైతులందరికి అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు, జనసైనికులు, రైతన్నలు రామయ్య, పవన్, వెంకటేష్ లు, పాడిపశువుల మహిళా రైతులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com